టీమ్‌లో అందరికంటే నేనే ఎక్కువ కష్టపడుతున్నా, అయినా... హార్ధిక్ పాండ్యా కామెంట్!
వెన్నుగాయంతో రెండేళ్లు బౌలింగ్ చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత ఆల్‌రౌండ్ రీఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ నుంచి దూరమై, గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న హార్ధిక్ పాండ్యా, మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచాడు..

హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో 2023 ఐపీఎల్ సీజన్‌లోనూ ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్, ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో పోరాడి ఓడింది. ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాకి వైట్ బాల్ వైస్ కెప్టెన్‌గా మారిన హార్ధిక్, టీ20ల్లో కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు..
2018 నుంచి టెస్టు ఫార్మాట్‌కి దూరంగా ఉన్నాడు హార్ధిక్ పాండ్యా. సరైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం వెతుకుతున్న భారత జట్టు, టెస్టుల్లో హార్ధిక్ పాండ్యా రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటోంది...
‘ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా నాపైన వర్క్‌లోడ్ మిగిలిన వాళ్ల కంటే రెట్టింపు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మూడు రెట్లు ఉంటుంది. టీమ్‌లో ఉన్న బ్యాటర్ బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు. బౌలర్ బౌలింగ్ మాత్రమే చేస్తాడు..
స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లకు బౌలింగ్‌లో పెద్దగా శారీరక శ్రమ ఉండదు. నేను, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ చూసుకోవాలి. నా ట్రైయినింగ్, ప్రాక్టీస్ సెషన్స్, ప్రిపరేషన్ క్యాంప్ అన్ని విభిన్నంగా ఉంటాయి.. బ్యాటింగ్ ప్రాక్టీస్ అయ్యాక, బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాత ఫీల్డింగ్ ప్రాక్టీస్..
Ishan Kishan-Hardik Pandya
మ్యాచ్ సమయంలో టీమ్‌కి అవసరమైనట్టుగా నా ఆటతీరు మార్చుకోవాలి. వన్డేల్లో నేను 10 ఓవర్లు వేయాల్సిన అవసరం వస్తే, వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. బ్యాటర్‌గా అవసరమైతే 30 ఓవర్లు బ్యాటింగ్ చేయడానికి కూడా రెఢీగా ఉండాలి..
Rahul Dravid-Hardik Pandya
అందుకే ఏం జరిగినా, ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధంగా ఉండేలా నన్ను నేను మానసికంగా పటిష్టం చేసుకున్నా. అందుకు ప్రపంచంలో నేను బెస్ట్ అనే నమ్మకం నాలో ఉండాలి.. అది సక్సెస్ ఇవ్వకపోవచ్చు కానీ కాన్ఫిడెన్స్ కచ్ఛితంగా పెంచుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు హార్ధిక్ పాండ్యా..