- Home
- Sports
- Cricket
- అంబటి రాయుడు టీమ్‌లో ఉంటే ఫేర్‌ప్లే అవార్డు అస్సలు గెలవలేం... ఎమ్మెస్ ధోనీ షాకింగ్ కామెంట్స్...
అంబటి రాయుడు టీమ్‌లో ఉంటే ఫేర్‌ప్లే అవార్డు అస్సలు గెలవలేం... ఎమ్మెస్ ధోనీ షాకింగ్ కామెంట్స్...
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ని 5 వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 15 ఓవర్లకు కుదించడం సీఎస్‌కేకి బాగా కలిసి వచ్చింది...
- FB
- TW
- Linkdin
Follow Us
)
చివరి ఓవర్ చివరి బంతి వరకూ సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి రెండు బంతుల్లో 6,4 బాది మ్యాచ్‌ని ముగించాడు రవీంద్ర జడేజా. ఈ విజయంతో అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన టీమ్‌గా ముంబై ఇండియన్స్ రికార్డుని సమం చేసింది సీఎస్‌కే...
శుబ్‌మన్ గిల్ ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు గెలవగా రషీద్ ఖాన్ బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు గెలిచాడు. యశస్వి జస్వాల్‌కి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దక్కగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఫెయిర్ ప్లే అవార్డు దక్కింది...
‘ప్రతీ ట్రోఫీ చాలా ప్రత్యేకమైనది. ఐపీఎల్‌లో ఎలాంటి మ్యాచ్‌కైనా సిద్ధంగా ఉండాలి. నేను కూడా మనిషినే, నాకూ ఫ్రస్టేషన్ వస్తుంది. అయితే నేను వారి ప్లేస్‌లో ఉంటే ఎలా ఫీల్ అవుతానని ఆలోచిస్తాను...
అంబటి రాయుడు ఫీల్డ్‌లో నూటికి నూరు శాతం ఇస్తాడు. అయితే అతను టీమ్‌లో ఉంటే, మేం ఎప్పటికీ ఫెయిర్ ప్లే అవార్డు గెలవలేం. అతను ఓ అద్భుతమైన క్రికెటర్. ప్రతీదాంట్లోనూ తాను భాగస్వామిగా ఉండాలని అనుకుంటాడు..
Ambati Rayudu
నేను ఇండియా A టీమ్‌కి ఆడినప్పటి నుంచి అంబటి రాయుడిని చూస్తున్నా. అతను చాలా స్పెషల్ అని ఎప్పటి నుంచో తెలుసు. అతనికి ఘనమైన ముగింపు దక్కినందుకు సంతోషంగా ఉంది..
ఇంకో విషయం ఏంటంటే నాలాగే అంబటి రాయుడు కూడా ఫోన్ ఎక్కువగా వాడడు. రిటైర్మెంట్ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా గొప్పగా సాగాలని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...
సరదాగా చెప్పినా ధోనీ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. అంబటి రాయుడు, ముంబై ఇండియన్స్‌కి ఆడిన మొదటి 8 సీజన్లలో 6 సార్లు ఫెయిర్‌ప్లే అవార్డు గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. అంబటి రాయుడు, సీఎస్‌కేలోకి వచ్చిన తర్వాత ఆరు సీజన్లలో ఒక్కసారి కూడా ఫెయిర్‌ప్లే అవార్డు రాలేదు..