- Home
- Sports
- Cricket
- టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్? రోహిత్ ప్లేస్‌లో అతనే కరెక్ట్ అంటున్న మాజీ క్రికెటర్...
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్? రోహిత్ ప్లేస్‌లో అతనే కరెక్ట్ అంటున్న మాజీ క్రికెటర్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఘోర ఓటమితో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వెస్టిండీస్ టూర్ ముగిసిన తర్వాత టెస్టు కెప్టెన్‌ని మార్చాలనే ఉద్దేశానికి బీసీసీఐ వచ్చినట్టు సమాచారం...

Sachin-Ashwin
ఇప్పటికే టీ20ల్లో హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత వన్డే కెప్టెన్సీ కూడా అతనికే ఇవ్వడం ఖాయం. వెస్టిండీస్ టూర్ తర్వాత వన్డే వరల్డ్ కప్ మధ్యలో ఎలాంటి టెస్టు సిరీస్‌లు ఆడడం లేదు భారత జట్టు...
2023 డిసెంబర్‌లో సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఆడుతుంది. అప్పటిలోగా కొత్త టెస్టు కెప్టెన్‌ని ఎంపిక చేసేందుకు బీసీసీఐకి కావాల్సినంత సమయం ఉంది. కొత్త టెస్టు కెప్టెన్ ఎవరు? అనే విషయం మీద ఇప్పటికే చర్చ మొదలైపోయింది..
రోహిత్ శర్మ ఫిట్‌నెస్ కారణంగా ఇంగ్లాండ్‌తో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లకు కెఎల్ రాహుల్‌ని తాత్కాలిక సారథిగా ఎంపిక చేయాల్సి వచ్చింది. దీంతో ఫిట్‌గా ఉండే ప్లేయర్‌ని టెస్టు కెప్టెన్‌గా నియమిస్తే బెటర్ అని సెలక్టర్లు నిర్ణయానికి వచ్చేశారట..
రోహిత్ శర్మను తప్పిస్తే, ఆ ప్లేస్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి టెస్టు సారథ్య బాధ్యతలు ఇవ్వాలని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్, స్పిన్నర్ దేవాంగ్ గాంధీ...
‘వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌కి పూజారాని ఎంపిక చేస్తే, అతను బాగా ఆడితే మరో ఏడాది ఆడే అవకాశం దొరుకుతుంది. అయితే వెస్టిండీస్ టూర్ తర్వాత డిసెంబర్ వరకూ టెస్టు సిరీస్‌లే లేవు. కాబట్టి పూజారా కంటే యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడమే చాలా మంచి నిర్ణయం అవుతుంది..
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్‌కి ఎందుకు బాధ్యతలు ఇవ్వకూడదు. అతను ఫిట్‌గా ఉన్నాడు, టెస్టుల్లో నెం.1 బౌలర్‌గా, నెం.2 ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. విదేశాల్లో కూడా అశ్విన్‌కి మంచి రికార్డు ఉంది.. కెప్టెన్సీ స్కిల్స్ విషయంలో డౌటే అవసరం లేదు...
ఒకవేళ అశ్విన్‌కి కెప్టెన్సీ ఇవ్వడం ఇష్టం లేకపోతే అజింకా రహానేకి ఇవ్వండి. టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న రహానేని అర్ధాంతరంగా తప్పించారు. లేకపోతే విరాట్ కోహ్లీ తర్వాత అతనే టెస్టు కెప్టెన్ అవ్వాల్సింది...
రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే అశ్విన్‌కి లేదా రహానేకి టెస్టు కెప్టెన్సీ ఇవ్వాలి. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్‌ని వైస్ కెప్టెన్‌గా నియమించి, ఫ్యూచర్ కెప్టెన్‌ని తయారుచేయొచ్చు... దానికి చాలా సమయం ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు దేవాంగ్ గాంధీ..
అయితే విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్, నెం.1 టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కి ఆ బాధ్యతలు దక్కవచ్చని టాక్ వినబడింది. అయితే రోహిత్ శర్మకు ఓటు వేశారు సెలక్టర్లు...