- Home
- Sports
- Cricket
- నెల రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ షమీకి రెస్ట్ ఎందుకు? వాళ్లని కాదని రుతురాజ్ ఏం సాధించాడని...
నెల రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ షమీకి రెస్ట్ ఎందుకు? వాళ్లని కాదని రుతురాజ్ ఏం సాధించాడని...
ఐసీసీ డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమి తర్వాత బీసీసీఐ, సెలక్టర్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందని, కొందరు కొత్త కుర్రాళ్లకు టీమ్‌లో చోటు దక్కవచ్చని భావించారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే ఎన్ని ఐసీసీ టోర్నీల్లో ఓడినా తమకు బుద్ధి రాదని మరోసారి నిరూపించుకున్నారు సెలక్టర్లు...

ఐసీసీ డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమి తర్వాత బీసీసీఐ, సెలక్టర్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందని, కొందరు కొత్త కుర్రాళ్లకు టీమ్‌లో చోటు దక్కవచ్చని భావించారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే ఎన్ని ఐసీసీ టోర్నీల్లో ఓడినా తమకు బుద్ధి రాదని మరోసారి నిరూపించుకున్నారు సెలక్టర్లు...
Sarfaraz Khan
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదరగొడుతున్న ప్లేయర్లను పట్టించుకోకుండా, ఐపీఎల్‌లో బాగా ఆడిన కుర్రాళ్లను వెస్టిండీస్ టూర్‌ని ఎంపిక చేసిన సెలక్టర్లు, కొత్త ముఖాలకు చోటు ఇచ్చేశామని చేతులు దులిపేసుకున్నారు. ఇది సెలక్టర్లపై మరిన్ని విమర్శలు రావడానికి కారణమవుతోంది..
తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, రంజీల్లో రికార్డు లెవెల్లో పరుగులు సాధించిన వసీం జాఫర్ కూడా టీమ్ సెలక్షన్‌పై విమర్శలు గుప్పించాడు. ‘టీమ్‌కి నలుగురు ఓపెనర్లతో ఏం అవసరం? వారికి బదులుగా మిడిల్ ఆర్డర్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ని సెలక్ట్ చేసి ఉంటే, అతను దేశవాళీ టోర్నీల్లో చూపిస్తున్న నిలకడైన ప్రదర్శనకు గుర్తింపు దక్కినట్టు ఉండేది...
Priyank Panchal
అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్, రంజీల్లో, ఇండియా A తరుపున ఎన్నో ఏళ్లుగా నిలకడైన ప్రదర్శన ఇస్తున్నారు. ఈ ఇద్దరూ కొన్నేళ్లుగా టెస్టు టీమ్‌లో చోటు కోసం సెలక్టర్ల తలుపులు కొడుతున్నారు.. కానీ కేవలం వాళ్లిద్దరూ ఐపీఎల్ ఆడడం లేదనే ఉద్దేశంతోనే పట్టించుకోవడం మానేశారా?
దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్న వారందరినీ పక్కనబెట్టి రుతురాజ్ గైక్వాడ్, క్యూలో ముందుకు ఎలా దూసుకొచ్చాడు? అతన్ని సెలక్ట్ చేయడానికి ఐపీఎల్ పర్పామెన్స్ కాకుండా ఇంకేమైనా కారణం ఉందా?...
Mohammed Shami
నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత కూడా మహ్మద్ షమీకి రెస్ట్ ఎందుకు ఇచ్చారు. ఇప్పుడు అతనున్న ఫామ్‌లో ఎంత ఎక్కువ బౌలింగ్ చేస్తే, అంత మెరుగ్గా మారతాడని నా అభిప్రాయం.. మీరేం అంటారు’ అంటూ నెటిజన్లను కోరాడు వసీం జాఫర్..