- Home
- Sports
- Cricket
- వరల్డ్ కప్‌కి టైం కూడా లేదు! ఇప్పటికీ టీ20లను సీరియస్‌గా తీసుకోకుంటే కష్టమే... భారత మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు..
వరల్డ్ కప్‌కి టైం కూడా లేదు! ఇప్పటికీ టీ20లను సీరియస్‌గా తీసుకోకుంటే కష్టమే... భారత మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు..
అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడబోతున్న భారత జట్టు, వచ్చే ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఆడబోతోంది. ఏకంగా 20 జట్లు పాల్గొనబోతున్న టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీపై ఇంకా ఫోకస్ పెట్టనేలేదు టీమిండియా...

అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడబోతున్న భారత జట్టు, వచ్చే ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఆడబోతోంది. ఏకంగా 20 జట్లు పాల్గొనబోతున్న టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీపై ఇంకా ఫోకస్ పెట్టనేలేదు టీమిండియా...
వెస్టిండీస్ టూర్ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్ స్వదేశానికి తిరిగి వచ్చేశారు..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా నిరూపించుకోలేకపోయిన రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఐర్లాండ్ టూర్‌లో ఓపెనర్లుగా వ్యవహరించబోతున్నారు. తన రెండో టీ20లో హాఫ్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్, మొదటి, మూడో టీ20ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యాడు..
Rinku Singh
రింకూ సింగ్, జితేశ్ శర్మ వంటి ఐపీఎల్ స్టార్లు, ఐర్లాండ్ టూర్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతుంటే శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబజ్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రిత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు...
‘టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఇంకా ఏడాది కూడా లేదు. మనం టీ20లను ఏ మాత్రం సీరియస్‌గా తీసుకుంటున్నట్టు అనిపించడం లేదు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ ఐర్లాండ్ టూర్‌కి వెళ్లడం లేదు...
Shubman Gill-Yashasvi Jaiswal
ప్రతీ ప్లేయర్‌కి బ్రేక్ అవసరమే అయితే, టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి ముందు టీమిండియా ఆడబోయే టీ20 మ్యాచులు 14. అందులోనూ సగం మంది రెస్ట్ తీసుకుంటే ఇక ప్లేయర్లకు ప్రాక్టీస్ ఎలా దొరుకుతుంది, టీమ్ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుంది..
ఐపీఎల్ ఉందిగా అనుకోవచ్చు, అయితే ఇండియాలో జరిగే ఐపీఎల్‌లో అందరూ అదరగొడతారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడడం వేరు, ఐపీఎల్ వేరు. అదీకాకుండా మనం టీ20 వరల్డ్ కప్ 2007 గెలిచినప్పుడు ఐపీఎల్ కూడా లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి...
అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం చాలా అవసరం. ఐర్లాండ్‌తో అయినా, బంగ్లాదేశ్‌తో అయినా కీ ప్లేయర్లు ఉంటేనే, టీమ్ కాంబినేషన్‌ని కొనసాగించడానికి వీలు ఉంటుంది. ఇషాన్ కిషన్‌ని రెండు టీ20లు ఆడించి, మూడింట్లో కూర్చోబెట్టారు..
ఇప్పుడు అతను ఐర్లాండ్ టూర్‌కి కూడా వెళ్లడం లేదు. కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉంటే ఇషాన్ కిషన్‌ని ఆసియా కప్‌లో ఆడిస్తారా? వరల్డ్ కప్‌లో చోటు ఇస్తారా? లేదు కదా.. అలాంటప్పుడు అతనికి రెస్ట్ ఇవ్వడంలో అర్థం ఏముంది?’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా..