- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ ఎంత గొప్పదైతే ఏం లాభం! ఐసీసీ టైటిల్స్ గెలవలేనప్పుడు.. వెస్టిండీస్ కోచ్ డారెన్ సమీ షాకింగ్ కామెంట్స్..
ఐపీఎల్ ఎంత గొప్పదైతే ఏం లాభం! ఐసీసీ టైటిల్స్ గెలవలేనప్పుడు.. వెస్టిండీస్ కోచ్ డారెన్ సమీ షాకింగ్ కామెంట్స్..
చివరిగా 2013లో ఛాంపియన్స్ ట్రోపీ గెలిచింది టీమిండియా. శ్రీలంక 2014లో, పాకిస్తాన్ 2017లో, ఆస్ట్రేలియా 2023లో, న్యూజిలాండ్ 2021లో (టెస్టు ఛాంపియన్‌షిప్).. ఇంగ్లాండ్ 2022లో గెలిచింది. చివరికి వెస్టిండీస్ 2016లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. టాప్ టీమ్‌గా కొనసాగుతున్న టీమిండియా మాత్రం 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్‌కి ఆమడ దూరంలో నిలుస్తోంది..

వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్‌ని నిర్వహిస్తున్న బీసీసీఐ, దీని ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖాతాలో వేసుకుంటోంది.
ఐపీఎల్ కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి జట్లు ఎంతగానో లాభపడ్డాయి. అయితే టీమిండియాకి కమర్షియల్‌గా తప్ప, అఛీవ్‌మెంట్స్ రూపంలో ఐపీఎల్ ద్వారా పెద్దగా ఒరిగిందేమీ లేదు...
Daren Sammy
‘భారత్‌కి ఐపీఎల్ ఓ బంగారు గని. దీని ద్వారా హార్ధిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్ వంటి ఎందరో యంగ్ స్టార్లు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఐపీఎల్ ఎంత గొప్పదైతే మాత్రం ఏం లాభం, ఒక్క ఇంటర్నేషనల్ ట్రోఫీ గెలవలేకపోతున్నారు?
యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్ వంటి చాలామంది యంగ్‌స్టర్స్, ఐపీఎల్ ద్వారా టీమ్‌లోకి వచ్చారు. హార్ధిక్ పాండ్యాకి ఇంకా చాలా కెరీర్ ఉంది. భారత క్రికెట్‌కి అద్భుతమైన ఫస్ట్ క్లాస్ నిర్మాణ వ్యవస్థ ఉంది..
Yashasvi Jaiswal
యశస్వి జైస్వాల్ 9 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 9 సెంచరీలతో 1800 పరుగులు చేసి, టీమ్‌లోకి వచ్చాడు. అతను ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఏం చేయగలనో నిరూపించుకున్నాడు. ఇది టీమిండియా ఫస్ట్ క్లాస్ క్రికెట్ స్టాండర్డ్. లోకల్ కుర్రాళ్లను ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఫ్రీగా ఆడేలా చేయగలుగుతోంది..
అయితే దేశవాళీ టోర్నీల కంటే ఐపీఎల్ ప్లేయర్లకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది. ఐపీఎల్ ఎంత పెద్ద సక్సెస్ అయినా సరే, ఐసీసీ టోర్నీలు గెలవలేకపోతే వృథాయే..’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కోచ్ డారెన్ సమీ..