MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • మెల్‌బోర్న్‌లో నంబర్-1 ఎవరు? సచిన్ టెండూల్కర్ రికార్డు.. విరాట్ కోహ్లి చరిత్ర సృష్టిస్తాడా ?

మెల్‌బోర్న్‌లో నంబర్-1 ఎవరు? సచిన్ టెండూల్కర్ రికార్డు.. విరాట్ కోహ్లి చరిత్ర సృష్టిస్తాడా ?

India vs Australia: మెల్‌బోర్న్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. ఈ గ్రౌండ్ లో సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 21 2024, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sachin Tendulkar, Virat Kohli, team India,

Sachin Tendulkar, Virat Kohli, team India,

India vs Australia: భారత్ vs ఆస్ట్రేలియా మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరుగుతుంది. డిసెంబర్ 26న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై ఇరు జట్లు గెలుపు పై దృష్టి పెట్టాయి. మూడు టెస్టు మ్యాచ్‌ల అనంతరం సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించగా, బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 

 

ఇప్పుడు మెల్‌బోర్న్‌లో కీలక మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో ఆధిక్యం సాధించడంపైనే ఇరుజట్ల దృష్టి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి భారీ రికార్డు సాధించే ఛాన్స్ ఉంది. అయితే మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళు ఎవరో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Sachin Tendulkar

Sachin Tendulkar

 1. సచిన్ టెండూల్కర్ 

మెల్‌బోర్న్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. మాస్టర్ బ్లాస్టర్ 10 మ్యాచ్‌ల్లో 44.9 సగటుతో 449 పరుగులు చేశాడు. అతను MCGలో తన టెస్ట్ మ్యాచ్‌లలో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. మొత్తంగా భారత్ తరపున ఈ గ్రామంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు.

36

2. అజింక్య రహానే

అజింక్య రహానే MCGలో ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 73.8 సగటుతో 369 పరుగులు చేశాడు. ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ MCGలో రెండు టెస్టు సెంచరీలు సాధించాడు. చివరిసారి మెల్‌బోర్న్‌లో జరిగిన సిరీస్‌లో అతను జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతను ఒక సెంచరీ కూడా చేశాడు.

46

3. విరాట్ కోహ్లీ

 భారత స్టార్ బ్యాట్స్ మెన్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరు మ్యాచ్‌ల్లో 52.7 సగటుతో 316 పరుగులు చేసి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. రహానెను అధిగమించాలంటే కోహ్లీ 54 పరుగులు చేయాల్సి ఉంటుంది. అలాగే సచిన్ టెండూల్కర్ ను అధిగమించాలంటే 134 పరుగులు చేయాలి. తొలి టెస్ట్ లో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ తర్వాత పెద్ద ఇన్నింగ్స్ లో అడగలేకపోయాడు. మరి ఈ గ్రౌండ్ లో ఏం చేస్తాడో చూడాలి మరి.

56
cricket virender sehwag

cricket virender sehwag

4. వీరేంద్ర సెహ్వాగ్ 

 

టీమిండియా స్టార్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆస్ట్రేలియాపై ఎన్నో ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఎంసీజీలో నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతను MCGలో తన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో సహా 280 పరుగులు చేశాడు. ఈ గ్రౌండ్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ల లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నాడు

.

66

5. రాహుల్ ద్రవిడ్ 

 

భారత జట్టు మాజీ కెప్టెన్ ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్ ఎన్నోసార్లు ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చిన ఆడాడు. ఆసీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. రాహుల్ ద్రవిడ్ ఎంసీజీలో ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతను MCGలో తన టెస్ట్ కెరీర్‌లో రెండు అర్ధ సెంచరీలతో సహా 263 పరుగులు చేశాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved