- Home
- Sports
- Cricket
- వరల్డ్ కప్ గెలిచినా, గెలవకపోయినా పాకిస్తాన్‌పై మాత్రం ఓడిపోకండి... శిఖర్ ధావన్ సెన్సేషనల్ కామెంట్స్...
వరల్డ్ కప్ గెలిచినా, గెలవకపోయినా పాకిస్తాన్‌పై మాత్రం ఓడిపోకండి... శిఖర్ ధావన్ సెన్సేషనల్ కామెంట్స్...
2017 వరకూ ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్‌పై తిరుగులేని ఆధిపత్యం కనబర్చింది టీమిండియా. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓడిన టీమిండియా, 2021 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది...

Image credit: Getty
ఆసియా కప్ 2022 టోర్నీలో గ్రూప్ స్టేజీలో పాకిస్తాన్‌పై గెలిచిన భారత జట్టు, సూపర్ 4 రౌండ్‌లో పరాజయాన్ని చవి చూసి ఫైనల్‌కి కూడా వెళ్లలేకపోయింది..
Shikhar Dhawan
2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో విరాట్ కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి గెలిచి ఊపిరి పీల్చుకుంది టీమిండియా. లేకపోతే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియాకి మరో షాక్ తగిలి ఉండేది.
Image credit: Getty
ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల్లో ఈ ఏడాది కనీసం మూడు సార్లు టీమిండియా, పాకిస్తాన్‌తో తలబడనుంది. రెండు జట్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2023 ఫైనల్ కూడా చూడొచ్చు..
Image credit: PTI
‘వరల్డ్ కప్ గెలిచినా, గెలవకపోయినా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం ఓడిపోకండని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటారు. వరల్డ్ కప్ గెలవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే టీమిండియా, ఐసీసీ టైటిల్ గెలిచి పదేళ్లు దాటిపోయింది..
దేవుడి దయవల్ల ఈసారి టీమిండియా, వరల్డ్ కప్ గెలవాలని నేనూ కోరుకుంటున్నా. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్లేయర్లలో ప్రెషర్ పీక్స్‌లోకి వెళ్లిపోయింది..
Image credit: PTI
అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ రకమైన సంతృప్తి వస్తుంది. ఎందుకంటే నేను పాకిస్తాన్‌తో ఆడిన చాలా మ్యాచుల్లో టీమిండియానే గెలిచింది. పాక్‌తో మ్యాచ్ అంటే గ్రౌండ్‌లో ఓ యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. అయితే వాళ్లతో కాసేపు మాట్లాడుతూ ప్రెషర్ తగ్గించుకుంటాం..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో నాకు చోటు దక్కుతుందో లేదో తెలీదు. ఒకవేళ అవకాశం వస్తే, నూరు శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, అవకాశం రాకపోయినా ఇంటి నుంచే టీమిండియాకి సపోర్ట్ చేస్తా..’ అంటూ కామెంట్ చేశాడు శిఖర్ ధావన్..
ఐసీసీ టోర్నీల్లో అద్బుతంగా ఆడే శిఖర్ ధావన్, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు, రెండు వరల్డ్ కప్ టోర్నీలు ఆడాడు. వీటిల్లో 6 సెంచరీలతో 65.15 సగటుతో 1238 పరుగులు చేసి, ‘మిస్టర్ ఐసీసీ టోర్నీస్’గా పేరు దక్కించుకున్నాడు శిఖర్ ధావన్. శుబ్‌మన్ గిల్ కారణంగా శిఖర్ ధావన్ వన్డే టీమ్‌లో కూడా చోటు కోల్పోయాడు.