- Home
- Sports
- Cricket
- రనౌట్ కాగానే కోపంతో రోహిత్ శర్మను తిట్టిన విరాట్ కోహ్లీ... ఆ కసితో డబుల్ సెంచరీ బాదేసిన హిట్‌మ్యాన్..
రనౌట్ కాగానే కోపంతో రోహిత్ శర్మను తిట్టిన విరాట్ కోహ్లీ... ఆ కసితో డబుల్ సెంచరీ బాదేసిన హిట్‌మ్యాన్..
మంచిగా చెబితే విననివాడు, కోపంగా చెబితే వింటాడు. కోపంగా చెప్పినా వినని వాళ్లు, కోపం తెప్పించేలా ప్రవర్తిస్తే చేయాల్సింది చేస్తారు. రోహిత్ శర్మ కూడా ఇదే టైపు. అప్పుడెప్పుడో 2007లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినా, టీమ్‌లో కుదురుకోవడానికి 2013 దాకా ఎదురుచూశాడు రోహిత్...
వైట్ బాల్ క్రికెట్‌లో ఓపెనర్‌గా మారిన తర్వాత రోహిత్ శర్మ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. టీమ్‌కి కీ ప్లేయర్‌గా మారిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2019లో టెస్టుల్లో ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చి, సూపర్ సక్సెస్ సాధించాడు..
2013, నవంబర్ 2న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో మొట్టమొదటి డబుల్ సెంచరీ సాధించాడు రోహిత్ శర్మ. అప్పటికే టీమిండియా తరుపున సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో డబుల్ సెంచరీ బాదేశారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 16 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు..
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇంతలా రెచ్చిపోయి ఆడడానికి విరాట్ కోహ్లీతో గొడవే కారణం. కెరీర్ ఆరంభం నుంచి రోహిత్ శర్మ వికెట్ల మధ్య చురుగ్గా కదిలేవాడు కాదు. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్‌కి వచ్చిన రోహిత్ శర్మ, తొలి వికెట్‌కి 112 పరుగుల భాగస్వామ్యం జోడించాడు..
శిఖర్ ధావన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కారణంగా రనౌట్ అయ్యాడు. 3 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ, పరుగు తీయాలని ప్రయత్నించగా రోహిత్ శర్మ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో డకౌట్ అయ్యాడు. అవుటైన తర్వాత రోహిత్‌ని కోపం తిడుతూ పెవిలియన్‌కి వెళ్లాడు విరాట్ కోహ్లీ...
విరాట్ కోహ్లీ అవుటయ్యే సమయానికి 59 బంతుల్లో 41 పరుగులే చేసిన రోహిత శర్మ, 71 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 114 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అవుటైన తర్వాత రోహిత్ శర్మపై అరిచిన విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ సెంచరీ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో చప్పట్లు కొడుతూ కనిపించాడు..
ఈ సీన్ తర్వాత రోహిత్ శర్మ విశ్వరూపమే చూపించాడు. 140 బంతుల్లో 150 పరుగుల మార్కు అందుకున్న రోహిత్ శర్మ, సిక్సర్లు, ఫోర్లతోనే డీల్ చేశాడు. 156 బంతుల్లో డబుల్ సెంచరీ బాదేశాడు. మొదటి సెంచరీకి 114 తీసుకుంటే, రెండో సెంచరీకి 42 బంతులే తీసుకున్నాడు హిట్‌మ్యాన్..
ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ, 50వ ఓవర్ వరకూ క్రీజులో నిలబడి 158 బంతుల్లో 16 ఫోర్లు, 12 ఫోర్లతో 209 పరుగులు చేసి... డబుల్ సెంచరీ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో లేచి నిలబడి చప్పట్లు కొడుతున్న విరాట్ కోహ్లీవైపు బ్యాటు చూపించాడు..ఈ మ్యాచ్‌లో టీమిండియా 50 ఓవర్లలో 383 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 326 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
అప్పటిదాకా టీమ్‌లోకి వస్తూ పోతూ ఉన్న రోహిత్ శర్మ, ఈ డబుల్ సెంచరీ తర్వాత తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టీమ్‌లో కీ ప్లేయర్‌గా మారి, 2021లో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు..