- Home
- Sports
- Cricket
- ఆడు పోయినాకే నేను రీఎంట్రీ ఇస్తా... పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజాపై మహమ్మద్ అమీర్ ఘాటు వ్యాఖ్యలు...
ఆడు పోయినాకే నేను రీఎంట్రీ ఇస్తా... పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజాపై మహమ్మద్ అమీర్ ఘాటు వ్యాఖ్యలు...
కెరీర్ పీక్ స్టేజీలో ఉన్న సమయంలో పీసీబీతో గొడవ పడి, అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్. ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్‌లో భారత జట్టు పరాజయానికి ప్రధాన కారణమైన అమీర్, రీఎంట్రీ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు...

‘ఇప్పటికీ నేను రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని, పాకిస్తాన్ తరుపున ఆడాలనే అనుకుంటున్నా. అయితే మా ఇద్దరి మధ్య అనుబంధం చాలా దూరం వెనక్కి వెళ్లిపోయింది. అది ఇప్పుడు తెగేలా కనిపించడం లేదు...
రమీజ్ రాజాకి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో అందరికీ తెలుసు. అందుకే అతను ఆ పొజిషన్‌లో ఉన్నంతకాలం నేను రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలనే ఆలోచన చేయాలని అనుకోవడం లేదు...
ఎప్పుడైనా రమీజ్ రాజా, పీసీబీని వీడిపోతాడే అప్పుడు నేను రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని, మళ్లీ పాక్ తరుపున ఆడతాను. నా మైండ్‌సెట్‌కి, నా స్కిల్స్‌కి ఎవ్వరితో పోల్చి చూసుకోను...
వేరే బౌలర్‌తో నాకు పోలీక అవసరం లేదు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న బౌలర్లు తోపులని కూడా నేను అనుకోను. ఎందుకంటే వరల్డ్ కప్ తర్వాత నన్ను టీమ్‌లో నుంచి తీసేశారు. ఆ సమయంలో కూడా నేను ర్యాంకింగ్స్‌లో ఏడాదిన్నర టాప్‌లో ఉన్నాను...
టెస్టుల్లో కమ్‌బ్యాక్ ఇవ్వాలనే ఆలోచన ఇప్పట్లో లేదు. అయితే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. నేను ఇప్పుడు క్లబ్ క్రికెట్ ఆడడాన్ని ఎంజాయ్ చేస్తున్నా. గత నాలుగేళ్లల్లో ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడింది లేదు...
ఇప్పుడు ఆడుతుంటే బాగా అనిపిస్తోంది. గోస్టర్‌షైర్ తరుపున మొదటి మ్యాచ్ తర్వాత నా పర్ఫామెన్స్ సంతృప్తినిచ్చింది. ఆ టీమ్ విజయం కోసం నా వంతు సహకారం అందించాలని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్...
30 ఏళ్ల మహమ్మద్ అమీర్ 2020 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆరు నెలల తర్వాత జూన్ 2021న కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన అమీర్, ఇప్పుడు పీసీబీ ఛైర్మెన్ పదవి నుంచి రమీజ్ రాజా తప్పుకున్నాకే ఆ నిర్ణయం తీసుకుంటునని వ్యాఖ్యానించాడు..
పాకిస్తాన్ తరుపున 36 టెస్టులు ఆడి 119 వికెట్లు తీసిన మహమ్మద్ అమీర్, 61 వన్డేల్లో 81 వికెట్లు పడగొట్టాడు. 50 టీ20 మ్యాచులు ఆడి 59 వికెట్లు తీశాడు. రమీజ్ రాజా, పీసీబీ ఛైర్మెన్‌గా తీసుకోకముందే అప్పటి బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌తో విభేదాలతో రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు అమీర్...