నేను నాన్నకి ముద్దు ఇస్తాలే అమ్మా... దెబ్బలన్నీ తగ్గిపోతాయి... పూజారా రెండేళ్ల కూతురు అదితి...

First Published Jan 21, 2021, 2:30 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన గబ్బా టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ అందరూ ఆడిన ఇన్నింగ్స్ ఓ ఎత్తు అయితే, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా ఆడిన ఇన్నింగ్స్ మరో ఎత్తు. 211 బంతులు ఎదుర్కొన్న పూజారా, ఏడు ఫోర్లతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే పూజారాను అవుట్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది ఆసీస్ పేస్ విభాగం. బౌన్సర్లు వేస్తూ భయపెడుతూ, పూజారాకి గాయాలు చేసింది.