- Home
- Sports
- Cricket
- ముత్తయ్య మురళీధరన్ కెరీర్‌ని కాపాడేందుకు మ్యాచ్ నుంచి వాకౌట్ చేసిన అర్జున రణతుంగ... ఒక్క ప్లేయర్ కోసం...
ముత్తయ్య మురళీధరన్ కెరీర్‌ని కాపాడేందుకు మ్యాచ్ నుంచి వాకౌట్ చేసిన అర్జున రణతుంగ... ఒక్క ప్లేయర్ కోసం...
టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన మొట్టమొదటి, ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్. ప్రస్తుతం అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో ఉన్న ఈ శ్రీలంక మాజీ స్పిన్నర్, కెరీర్ ఆరంభంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి కారణం అతని బౌలింగ్ యాక్షన్..

muttaiah muralidharan
1992లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన యంగ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, అప్పటికి దిగ్గజ క్రికెటర్లుగా వెలుగొందుతున్న బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. భిన్నమైన బౌలింగ్ యాక్షన్‌తో మురళీ వేసే బంతులను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బ్యాటర్లు అస్సలు అంచనా వేయలేకపోయారు..
క్రికెట్ ప్రపంచంలో తమ ఆధిక్యానికి ముత్తయ్య మురళీధరన్, ప్రమాదకారిగా మారతాడని భావించిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలు, అతని కెరీర్ నాశనం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నించాయి. అతన్ని మానసికంగా దెబ్బ తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి..
Muttiah Muralitharan
బంతి వేయడానికి ముందు దాన్ని కనిపించకుండా దాచి పెడుతున్నాడని, విసిరి కొడుతున్నాడని కొందరు అంపైర్లు, ముత్తయ్య మురళీధరన్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీని కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమైన మురళీ, ఐసీసీ టెస్టు క్లియర్ చేసి రీఎంట్రీ ఇచ్చాడు..
Muttiah Muralitharan
1995లో రీఎంట్రీ ఇచ్చిన ముత్తయ్య మురళీధరన్‌ని మానసికంగా దెబ్బ తీసేందుకు పైఎత్తులు వేసింది ఆస్ట్రేలియా... ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ముత్తయ్య మురళీధరన్ వేసిన ప్రతీ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు ఆసీస్ అంపైర్ డారెల్ హెయిర్.. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఆసీస్ అంపైర్ రోస్ ఎమిర్సన్ కూడా ఇదే చేశాడు.
ఇది నిజంగానే ముత్తయ్య మురళీధరన్‌పై ప్రభావం చూపించింది. ఈ సిరీస్‌ని శ్రీలంక 3-0 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 1999లో శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో కలిసి ట్రై సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది.
Muttaiah Muralitharan (Sri Lanka)
ఐసీసీ, ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ యాక్షన్‌పై క్లీయరెన్స్ ఇచ్చినా, ఆస్ట్రేలియా అంపైర్లు మాత్రం కావాలని అతను వేసిన ప్రతీ బంతిని నో బాల్‌గా ప్రకటించారు. దీంతో వీళ్లతో మాట్లాడి వేస్ట్ అని భావించిన శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ, అంపైర్‌పై నిరసన తెలుపుతూ తన టీమ్‌తో కలిసి ఆ మ్యాచ్ నుంచి వాకౌట్ చేశాడు.
ఇది అప్పట్లో పెను సంచలనం క్రియేట్ చేసింది. రణతుంగ ఇలా మ్యాచ్ మధ్యలో టీమ్‌తో కలిసి వాకౌట్ అవుట్ చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచంలో అలజడి మొదలైంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డు మధ్య చాలా చర్చలు జరిగాయి.
Arjuna Ranatunga
ఆఖరికి ఇరు జట్ల బోర్డుల మధ్య రాజీ జరిగిన తర్వాత మ్యాచ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి. ‘నువ్వు అంపైర్‌గా ఉన్నావ్, నేను కెప్టెన్‌గా ఉన్నా. నా బౌలర్, తనేం వేయాలనుకుంటే ఆ బాల్ వేస్తాడు. నువ్వు చూస్తూ ఉండడం తప్ప చేసేదేమీ లేదు’ అని అంపైర్ రోస్ ఎమిర్సన్‌తో కామెంట్ చేశాడు అర్జున రణతుంగ.
Arjuna Ranatunga
ఈ వ్యాఖ్యల కారణంగా ఐసీసీ, అర్జున రణతుంగపై 6 మ్యాచుల నిషేధం వేసి, 75 మ్యాచ్ ఫీజ్ కోత వేసింది. అయితే అర్జున రణతుంగ మాత్రం ఎక్కడా రాజీ పడలేదు.
రీఎంట్రీ తర్వాత ముత్తయ్య మురళీధరన్‌ని టీమ్ నుంచి తీసేయొచ్చుగా అనే ప్రశ్న, లంక మాజీ కెప్టెన్‌కి ఎదురైంది. ‘తన బౌలింగ్ యాక్షన్‌లో లోపాలు లేవని ఐసీసీయే చెప్పింది. ఎవరికోసమో అతన్ని ఎందుకు తీసేయాలి.’ అంటూ సమాధానం ఇచ్చాడు అర్జున రణతుంగ..
అలా కెప్టెన్ అర్జున రణతుంగ కారణంగా కెరీర్‌లో నిలదొక్కుకున్న ముత్తయ్య మురళీధరన్, క్రికెట్ ప్రపంచంలోనే మోస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో కెప్టెన్ అర్జున రణతుంగ పాత్ర కీ రోల్‌గా ఉండనుంది.