MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • అది లేనప్పుడు ఎంత వేగంగా బౌలింగ్ వేసి ఏం లాభం... ఉమ్రాన్ మాలిక్‌ బౌలింగ్‌పై ఇషాంత్ శర్మ...

అది లేనప్పుడు ఎంత వేగంగా బౌలింగ్ వేసి ఏం లాభం... ఉమ్రాన్ మాలిక్‌ బౌలింగ్‌పై ఇషాంత్ శర్మ...

ఐపీఎల్‌లో 150+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసి మెరుపు వేగంతో టీమిండియాలోకి దూసుకొచ్చాడు ఉమ్రాన్ మాలిక్. ఇప్పటికే వన్డేల్లో, టీ20ల్లో టీమిండియా తరుపున అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన బౌలర్‌గా రికార్డులు క్రియేట్ చేసేశాడు ఈ జమ్మూ కశ్మీర్ బౌలర్.. టీమిండియా తరుపున 8 వన్డేలు, 8 టీ20 మ్యాచులు ఆడిన ఉమ్రాన్ మాలిక్, ఓవరాల్‌గా 24 వికెట్లు తీశాడు..  

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 21 2023, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


వన్డేల్లో 6.45 ఎకానమీతో బౌలింగ్ చేస్తున్న ఉమ్రాన్ మాలిక్, టీ20ల్లో అయితే ఏకంగా 10.48 ఎకానమీతో పరుగులు సమర్పిస్తున్నాుడ. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి వెలుగులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Umran Malik

Umran Malik

‘ఉమ్రాన్ మాలిక్ బంతి ఎక్కడ పడుతుందనే విషయంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అయితే అనుభవంతో ఆ విషయాన్ని అతను తెలుసుకోగలుగుతాడు. 150- 160 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసే బౌలర్, తన వేగంపైనే ఎక్కువ దృష్టి పెడతాడు. పెట్టాలి కూడా...

38
Image credit: PTI

Image credit: PTI

వేగంగా బౌలింగ్ చేయడం వల్ల బ్యాటర్లకు పని తక్కువ అవుతుంది. బలంగా కొట్టాల్సిన అవసరం లేకుండానే టచ్ చేసి బౌండరీలు రాబట్టవచ్చు. అందుకే ఎక్కువగా పరుగులు ఇచ్చేస్తున్నానని ఉమ్రాన్ మాలిక్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అయితే బ్యాటర్లు భయంతో కళ్లు మూసుకోకపోతే ఎంత బౌలింగ్ చేసినా ఏం లాభం...
 

48

కాబట్టి అతనికి అలాంటి నమ్మకం ఇవ్వాలి. నీ బౌలింగ్‌లో ఆడాలంటే బ్యాటర్లు భయపడి కళ్లు మూసుకుంటున్నారని చెప్పాలి. ఇలాంటి మాటలు అతన్ని మరింత ఉత్సాహపరుస్తాయి. వికెట్లని టార్గెట్ చేస్తూ బంతులు విసిరేలా అతన్ని ఉసిగొల్పుతాయి.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ...

58
Umran Malik

Umran Malik

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌పై ప్రశంసలు గుప్పించాడు.. ‘నేను బౌలింగ్ చేయడానికి 26 గజాలు పరుగెడతాను. కానీ ఉమ్రాన్ మాలిక్ 20 గజాలే పరుగెడతాడు. అతను 26 గజాల దూరం వెళ్లాలంటే అతని ఫిట్‌నెస్ మరింత పెరగాలి. మరింత ధృడమైన కండరాలు పెంచాలి. అయితే అతనికి ఇంకా పెద్ద అనుభవం లేదు.. అన్నీ నేర్చుకుంటాడు...

68

అతనికి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అతను నా రికార్డును బ్రేక్ చేయాలని అనుకుంటే చేసేయ్.. 20 ఏళ్లుగా ఆ రికార్డును ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. వరల్డ్ ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును బ్రేక్ చేసిన బౌలర్‌ని నేను హగ్ చేసుకుని, కిస్ చేస్తా...

78
Umran Malik-Shoaib Akhtar

Umran Malik-Shoaib Akhtar

ఉమ్రాన్ మాలిక్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని రన్నప్ కూడా చాలా బాగుంది. ఆర్మ్ స్పీడ్ చక్కగా ఉంది. అయితే కొన్ని మెలకువలు చాలా నిష్టగా నేర్చుకోవాలి, ధైర్యంగా బౌలింగ్ చేయగలగాలి. బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు వస్తున్నాయని నిరాశపడకూడదు.. 

88

స్పీడ్ తగ్గించకూడదు. ప్రతీ బంతిని మరింత వేగంగా వేయాలనే చూడాలి. అప్పుడే సక్సెస్ అవుతాడు. ఫీల్డ్‌లోకి వెళ్లాక బాల్ ఓనర్‌వి నువ్వే. అది ఎలా వెళ్లాలో డిసైడ్ చేయాల్సింది నువ్వే.. అలా చేయాలంటే నీకు మరింత ప్రాక్టీస్ కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్..

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AFG vs IND: అభిషేక్ శ‌ర్మ విధ్వంసం, ఆఫ్గానిస్తాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Recommended image2
IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. సంజూ వచ్చేశాడు.. భారత తుది జట్టు ఇదే
Recommended image3
Asia Cup 2026 Final: దుబాయ్ లో బిగ్ ఫైట్.. 8వ సారి ఆసియా కప్‌పై కన్నేసిన భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved