సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ వేరే జట్టులో ఉండి ఉంటేనా... బ్రియాన్ లారా కామెంట్స్...
First Published Nov 23, 2020, 5:40 PM IST
ఐపీఎల్ 2020 సీజన్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. క్రీజులోని అన్ని వైపులా ఆడుతూ భారతదేశపు ‘మిస్టర్ 360’ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ ముంబై బ్యాట్స్‌మెన్. నాలుగు సీజన్లుగా ఐపీఎల్‌లో 400+ పరుగులు సాధించిన సూర్యకుమార్ యాదవ్‌కు టీమిండియాలో చోటు దక్కపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా సూర్యకుమార్ యాదవ్‌ను ఆసీస్ టూర్‌కి ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు విండీస్ లెజెండ్ బ్రియాన్ లారా.

ముంబై క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కి ఆసీస్ టూర్‌లో చోటు దక్కకపోవడంతో భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

బ్యాటింగ్‌లో ఇంతగా రాణిస్తున్నా, జట్టులో స్థానం దక్కకపోవడంతో టీమిండియాలోకి రావాలంటే సూర్యకుమార్ యాదవ్ ఇంకేం చేయాలంటూ సెలక్టర్ల తీరును ప్రశించారు మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్...
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?