సిడ్నీ టెస్టు చూడాలంటే మాస్క్ తప్పనిసరి... స్టేడియంలో సీటు కొనుక్కుని, ఇంట్లో నుంచే చూసేలా...

First Published Jan 6, 2021, 11:48 AM IST

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు రేపు ప్రారంభం కానుంది. సిడ్నీలో జరిగే ఈ టెస్టు కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ఫలితం టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లకు కీలకం కానుండడం కూడా సిడ్నీ టెస్టుకి ఇంత క్రేజ్ రావడానికి ఓ కారణం. సిడ్నీ టెస్టు ‘పింక్ టెస్టు’గా జరగనుంది.

బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి సహాయార్థం... ఒక మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించేందుకు సిడ్నీ టెస్టులో ప్లేయర్లు పింక్ క్యాపుల్లో మెరవనున్నారు.

ప్లేయర్లు ధరించే క్యాపులతో పాటు, వికెట్లు, స్టేడియం చుట్టూ ఉండే బౌండరీ కూడా పింక్ రంగులోనే మెరుస్తుంది...

సిడ్నీ నగరంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో పింక్ టెస్టుకి కేవలం 25 శాతం కెపాసిటీ ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకుంది ఆస్ట్రేలియా...

కరోనా ఫియర్ కారణంగా సిడ్నీ టెస్టుకి హాజరయ్యే ప్రేక్షకులు తినేటప్పుడు, తాగేటప్పుడు మినహా మిగిలిన సమయాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాల్సి ఉంటుంది...

అలాగే కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చేవారికి స్టేడియంలోకి అనుమతి లేదని స్పష్టం చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా...

సిడ్ని టెస్టుకి కొద్దిమంది ప్రేక్షకులు మాత్రమే హాజరు అవుతుండడంతో బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించేందుకు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది మెక్‌గ్రాత్ ఫౌండేషన్...

స్టేడియంలో వర్చువల్ సీట్లను ఏర్పాటు చేసిన మెక్‌గ్రాత్ ఫౌండేషన్, ఈ సీట్ల టికెట్లను కొనుగోలు చేసి ఇంట్లో నుంచి మ్యాచులు వీక్షించవచ్చని తెలిపింది...

అంటే పింక్ కలర్‌లో ఉండే ఈ సీట్ల మీద వర్చువల్ సీటు కొన్నవారి పేరు ఉంటుంది. ఇలా స్టేడియానికి రాకపోయినా స్టేడియం టికెట్లన్నీ అమ్మే అవకాశం ఉంటుంది...

వర్చువల్ సీట్ల టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును ఆస్ట్రేలియాలో బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 700 కుటుంబాలకు అందచేస్తామని తెలిపాడు మెక్‌గ్రాత్...

సిడ్నీ టెస్టు పిచ్‌లో పచ్చిక ఎక్కువగా ఉంటుందని, మొదటి రోజు నుంచి స్పిన్‌కి ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉందని తెలిపారు పిచ్ క్యూరేటర్...

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?