- Home
- Sports
- Cricket
- రోహిత్ సరే! విరాట్‌ని టీ20ల నుంచి తప్పిస్తారా? కోహ్లీ లేకపోతే ఆ మ్యాచులు గెలిచేవాళ్లమా...
రోహిత్ సరే! విరాట్‌ని టీ20ల నుంచి తప్పిస్తారా? కోహ్లీ లేకపోతే ఆ మ్యాచులు గెలిచేవాళ్లమా...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కి దూరంగా ఉంటున్నారు. శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులోనూ రోహిత్, విరాట్‌లకు చోటు దక్కలేదు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన విరాట్‌కి టీ20ల్లో చోటు దక్కకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం..

ఈ ఏడాది టీ20ల్లో 138.23 స్ట్రైయిక్ రేటుతో 55.78 సగటుతో 781 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. 2022లో అత్యధిక టీ20 పరుగులు చేసిన బ్యాటర్లలో మూడో స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 46.56 సగటుతో 1164 పరుగులు చేయగా మహ్మద్ రిజ్వాన్ 45.27 సగటుతో 996 పరుగులు చేశాడు..
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, 296 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు..
Image credit: Getty
‘విరాట్ కోహ్లీని టీ20ల నుంచి తప్పించడం షాకింగ్‌గా అనిపించింది. టీ20ల్లో విరాట్‌కి ఇచ్చిన రోల్‌ని అతను సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ లేకపోతే టీమిండియా ఓడిపోయేదే. అతను ఆడిన ఇన్నింగ్స్ చాలా విలువైనది. అలాంటి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా విరాట్ కోహ్లీని టీ20ల నుంచి తప్పిస్తారా?..
virat
నాకు తెలిసి శ్రీలంకతో టీ20 సిరీస్‌కి ఎంపిక కానంత మాత్రాన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇక పొట్టి ఫార్మాట్ ఆడరని కాదు. కుర్రాళ్లకు అవకాశం ఇస్తున్నారు. యంగ్ ప్లేయర్లు సరిగ్గా రాణించకపోతే మళ్లీ సీనియర్లు టీమ్‌లోకి రావాల్సిందే...
Image credit: Getty
విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ లాంటి మ్యాచ్ విన్నర్లను అన్ని ఫార్మాట్లలో వాడుకోవాలి. ఫామ్‌లో లేని ప్లేయర్లను పక్కనబెట్టడంలో తప్పు లేదు, అయితే మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌లు ఇచ్చిన తర్వాత కూడా టీమ్‌లో నుంచి తప్పించడం సరైన సంకేతాలు ఇవ్వదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం..