మన దగ్గర సరైన కోచ్‌లు లేరా? ఎందుకీ పరిస్థితి... ఆటగాళ్ల గాయాలపై బీసీసీఐ నయా బాస్ సీరియస్...
కొన్నేళ్లుగా టీమిండియాని ఎక్కువగా ఇబ్బందిపెడుతున్న విషయం ఆటగాళ్ల గాయాలు. పేపర్ మీద అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టు, కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కావడం వల్ల ఆసియా కప్ వంటి టోర్నీల్లో ఆశించిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది. జస్ప్రిత్ బుమ్రా, జడేజా, దీపక్ చాహార్... గాయాల కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమయ్యారు..
Jasprit Bumrah
ఐపీఎల్ సమయంలో ఫిట్‌గా ఉంటూ, అన్ని మ్యాచులకు అందుబాటులో ఉన్న ప్లేయర్లు, టీమిండియా ఆడే మ్యాచుల విషయానికి వచ్చే సరికి గాయాల పేరు చెప్పి తప్పుకుంటున్నారు. అసలు తప్పు ఎక్కుడ జరుగుతోంది. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెడతానని అంటున్నారు బీసీసీఐ నయా బాస్ రోజర్ బిన్నీ...
Image credit: Getty
‘ప్లేయర్ ఎవరైనా క్రీజులో గాయపడితే రెండు మూడు రోజుల్లో సెట్ అవ్వాలి. మహా అయితే రెండు వారాలు... అలాంటిది ఆరేడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సినంత తీవ్రంగా ఆటగాళ్లు ఎందుకు గాయపడుతున్నారు? ఇంత తీవ్రంగా గాయాలు ఎలా అవుతున్నాయి..
ఈ సమస్య ఇప్పుడు పుట్టింది కాదు,గత నాలుగేళ్లుగా భారత జట్టులో ఈ సమస్య ఉంది. దీనికి ఓ శాశ్వత పరిష్కారం కనుక్కోవాలంటే అసలు గాయాలకు దారి తీస్తున్న పరిస్థితులేంటో తెలుసుకోవాలి. మన దగ్గర మంచి ట్రైయినర్లు లేరా? లేక మంచి కోచ్‌లు లేరా...
Image credit: Getty
వర్క్ లోడ్ మరీ తీవ్రంగా ఉంటోందా? లేక మూడు ఫార్మాట్లు ఆడడం వల్ల ఇలా జరుగుతోందా... లేదా ఆటగాళ్ల ప్రిపరేషన్ విషయంలోనే లోపాలు ఉన్నాయా? ఇవన్నీ తేలాలి. వరల్డ్ కప్‌కి 10 రోజుల ముందు బుమ్రా గాయపడడం ఏంటి? అతన్ని ఎవరు రిప్లేస్ చేయగలరు... ఇదే ఇప్పుడు ముఖ్యమైన సమస్య...
bumrah
భారత్‌లో పిచ్‌ల్లో జీవం కావాలి. ఇప్పుడున్న పిచ్‌లు స్పిన్నర్లకు బాగా ఉపయోగపడతాయి. కానీ ఫాస్ట్ బౌలర్లకు పనికి రావు. అందుకే మనవాళ్లు విదేశాల్లో సరిగ్గా రాణించలేకపోతున్నారు. ఇక్కడి పిచ్‌లను కూడా విదేశాల్లో పిచ్‌ల్లా రూపొందిస్తే ఈ సమస్య ఉండదు కదా...’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ...