- Home
- Sports
- Cricket
- మేమంతా ప్రొఫెషనల్స్! మా లక్ష్యం ఒక్కటే... ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగకండి! మీడియాపై రోహిత్ శర్మ ఫైర్...
మేమంతా ప్రొఫెషనల్స్! మా లక్ష్యం ఒక్కటే... ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగకండి! మీడియాపై రోహిత్ శర్మ ఫైర్...
ఐపీఎల్‌లో మెస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా భారీ అంచనాలతో భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు రోహిత్ శర్మ. అయితే ఇప్పటిదాకా రోహిత్ టీమ్ నుంచి చెప్పుకోదగ్గ ఒక్క విజయం కూడా రాలేదు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ, రోహిత్ శర్మ కెరీర్‌కి కీలకం కానుంది..

ప్రస్తుతం ఆసియా కప్ 2023 టోర్నీ కోసం శ్రీలంకలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి జట్టును ప్రకటించాడు. ఈ సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు ఘాటుగా బదులిచ్చాడు రోహిత్ శర్మ..
‘10 ఏళ్లుగా టీమిండియా, ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది. జనాలు, భారత జట్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ ప్రెషర్, టీమ్‌పైన ఉంటుందా? ఈ మధ్య టీమ్ పర్ఫామెన్స్ కూడా బాగోలేదు...’ అంటూ ఓ రిపోర్టర్, రోహిత్ శర్మను ప్రశ్నించాడు..
Rohit Sharma
‘నేను ఈ ప్రశ్నకు చాలా సార్లు సమాధానం చెప్పాను. బయటి వ్యక్తులు ఏమనుకుంటున్నారో మాకు అనవసరం. మేం అవేమీ పట్టించుకోం. జట్టులో ఉన్న ప్రతీ ప్లేయర్ కూడా ప్రొఫెషనల్. ఇలాంటి ప్రశ్నలు అడగకండి. నేను ఇలాంటి వాటికి సమాధానం ఇవ్వను..
బయటివాళ్లు ఏమనుకుంటున్నారనే విషయం, టీమ్‌కి అవసరం లేదు. మా ఫోకస్ వేరు, మా లక్ష్యం వేరు. బయటి వ్యక్తుల అభిప్రాయాలను మేం అస్సలు పట్టించుకోం..
Rohit Sharma
టీమ్‌ని ఎంపిక చేసినప్పుడు రకరకాల అభిప్రాయాలు వినిపించడం చాలా కామన్. అయితే కేవలం 15 మందిని మాత్రమే తీసుకోగలం. టీమ్‌లో ప్లేస్ దక్కనివాళ్లు నిరుత్సాహపడతారు. నేను కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా. టీమ్‌లో చోటు దక్కకపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు..
ఇప్పటికైతే నాకు వరల్డ్ కప్ కోసం ఎలాంటి ప్లాన్స్ లేవు. మంచి ప్లేయర్లు చాలా మంది ఉన్నా కూడా సమస్యే. ప్రత్యర్థి బట్టి టీమ్‌ని డిసైడ్ చేస్తాం, ఫామ్‌ని బట్టి ప్లేయర్లకు ప్రాధాన్యం ఇస్తాం.. టీమ్ కాంబినేషన్ కోసం కొందరు ప్లేయర్లను పక్కనబెట్టక తప్పదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..