- Home
- Sports
- Cricket
- వాషింగ్టన్ సుందర్, నాకంటే చాలా టాలెంటెడ్.., దినేశ్ కార్తీక్‌ని రిక్వెస్ట్ చేస్తా... కోచ్ రవిశాస్త్రి...
వాషింగ్టన్ సుందర్, నాకంటే చాలా టాలెంటెడ్.., దినేశ్ కార్తీక్‌ని రిక్వెస్ట్ చేస్తా... కోచ్ రవిశాస్త్రి...
ఆస్ట్రేలియా జరిగిన నాలుగో టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీయడమే కాకుండా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సుందర్ పర్ఫామెన్స్‌పై తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కోచ్ రవిశాస్త్రి.

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన వాషింగ్టన్ సుందర్, నాలుగో టెస్టులో 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ రనౌట్‌తో ఐదు బంతుల తేడాతో మూడు వికెట్లు కోల్పోవడంతో సుందర్‌కి సెంచరీ చేసే అవకాశం దొరకలేదు.

‘వాషింగ్టన్ సుందర్ చాలా టాలెంటెడ్ ప్లేయర్. 80ల్లో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కెప్టెన్సీలో నేను ఎలా ఆడానో, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో సుందర్ అలా ఆడుతున్నాడు. నాకంటే వాషింగ్టన్ సుందర్ చాలా టాలెంటెడ్...

ఆ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. టెస్టుల్లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌పైన మరింత దృష్టిపెట్టాలి. అతనికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. విదేశీ పిచ్‌లపై కూడా అద్భుతంగా రాణించగలనని నిరూపించుకున్నాడు సుందర్...

లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్ అవసరం టీమిండియాకు చాలా ఉంది. అవసరమైతే 20 ఓవర్లు బౌలింగ్ చేయగలడు, తన బౌలింగ్‌లో రెండు, మూడు వికెట్లు కూడా తీయగలడు...

దేశవాళీ క్రికెట్‌లో సుందర్ బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెడితే బెటర్. అందుకే అతన్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్ 4 ప్లేసుల్లో ఆడించాలని తమిళనాడు జట్టును, తమిళనాడు కెప్టెన్ దినేశ్ కార్తీక్‌ను అడుగుతాను...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి...

‘రిషబ్ పంత్ ఓ సెన్సేషనల్ ప్లేయర్. విదేశాల్లో చక్కగా బ్యాటింగ్ చేయగలడు. అయితే కొన్నాళ్ల క్రితం రిషబ్ పంత్ భారీగా బరువు పెరిగాడు. ఆ కారణంగానే పర్ఫామెన్స్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు...

అందుకే అతని విషయంలో చాలా కఠినంగా వ్యవహారించాం. టీమిండియాలో ప్లేస్ కావాలంటే బరువు తగ్గాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాం... ఫలితం మీరే చూస్తున్నారు...

జిమ్‌లో అతను చాలా శ్రమించాడు. బరువు తగ్గించుకుని, వికెట్ కీపింగ్‌లో కూడా మెరుగయ్యాడు... అతను భవిష్యత్తులో తిరుగులేని మ్యాచ్ విన్నర్ అవుతాడు...

అక్షర్ పటేల్ చాలా మంచి స్పిన్నర్. చాలా ఏళ్లుగా అతను భారత జట్టుతోనే ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని జడేజా లేని లోటు తెలియనీయకుండా రాణించాడు... అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ కలిసి ఆడితే చూడాలని ఉంది’ అంటూ వ్యాఖ్యానించాడు రవిశాస్త్రి...