- Home
- Sports
- Cricket
- ఆ చెత్తను పబ్లిక్‌లో కడగాల్సిన అవసరం లేదు... విరాట్ కోహ్లీ, బీసీసీఐ గొడవపై మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్...
ఆ చెత్తను పబ్లిక్‌లో కడగాల్సిన అవసరం లేదు... విరాట్ కోహ్లీ, బీసీసీఐ గొడవపై మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్...
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభానికి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే భారత క్రికెట్ జట్టులో కొన్ని వివాదాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య వైరం నెలకొందని జోరుగా ప్రచారం జరుగుతోంది...

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పిస్తూ బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయం తీసుకోవడం, ఈ నిర్ణయానికి భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సపోర్ట్ ఉండడంతో వివాదానికి తెర లేచింది...
విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని తాను కోరానని, అయినా అతను వినలేదని... దాంతో వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతో సెలక్టర్లు ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని గంగూలీ కామెంట్ చేశాడు...
అయితే ఆ తర్వాత కొన్నిరోజులకు విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో చేసిన కామెంట్లు... భారత క్రికెట్ బోర్డులో ఏదో జరుగుతుందని అభిమానులు ఫిక్స్ అయ్యేలా చేశాయి...
‘నేను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పినప్పుడు ఎవ్వరూ వద్దని చెప్పలేదు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేయడానికి గంటన్నర ముందే చెప్పారు...’ అంటూ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
విరాట్ కోహ్లీ కామెంట్లతో బీసీసీఐని, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీని, సెక్రటరీ జై షాను తీవ్రంగా విమర్శిస్తూ, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అభిమానులు...
‘విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలని అనుకుంటే బీసీసీఐ ఈ విషయాన్ని చాలా సున్నితంగా డీల్ చేయాల్సింది. అదే కాదు, ఇలాంటి చాలా విషయాలను మాటలతో పరిష్కరించాల్సిన వాటిని, గొడవల దాకా తీసుకొచ్చారు...
అయితే చెత్తను క్లీన్ చేసేటప్పుడు అందరికీ తెలిసేలా, పబ్లిక్‌లో చేయం కదా.. అలాగే భారత క్రికెట్ బోర్డులో నెలకొన్న వివాదాలను కూడా అందరికీ తెలిసేలా పరిష్కారించాల్సిన అవసరం లేదు...
అయితే అందరూ బీసీసీఐదే తప్పని అంటున్నారు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విరాట్ కోహ్లీ ఫీల్ అయి ఉంటే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఓ ఫోన్ కాల్ చేసి ఉంటే సరిపోయేదిగా...
బీసీసీఐతో పాటు ఎవరి ధోరణితో అయితే అతను బాధపడ్డాడో వారితో ఆ విషయం గురించి చెప్పినా, మాట్లాడినా ఇదంతా జరిగేది కాదు కదా...
అయినా ఇలాంటి విషయాలు బయటి వ్యక్తుల ద్వారా తెలిస్తే ఏం కాదు, కానీ బీసీసీఐ అధికారులు, విరాట్ కోహ్లీయే ఇలాంటి కామెంట్లు చేయడంతో చాలా పెద్ద రచ్చే జరిగింది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో చేసిన కామెంట్లపై బీసీసీఐ సీరియస్‌గా ఉందని, సౌతాఫ్రికా టూర్ ముగిసిన తర్వాత అతనిపై చర్యలు తీసుకోవాలని చూస్తోందని వార్తలు వస్తున్నాయి...