- Home
- Sports
- Cricket
- ఇండియాతో ఫైనల్ ఆడేందుకు వెయిట్ చేస్తున్నాం... టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్‌పై ప్యాట్ కమ్మిన్స్...
ఇండియాతో ఫైనల్ ఆడేందుకు వెయిట్ చేస్తున్నాం... టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్‌పై ప్యాట్ కమ్మిన్స్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 ఫైనల్ బెర్త్‌లు దాదాపు ఖరారైపోయినట్టే. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన సౌతాఫ్రికా, మూడో మ్యాచ్‌లోనూ ఓడితే... ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది. ఆస్ట్రేలియా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది...

Pat Cummins
ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడబోతోంది భారత జట్టు. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భారత జట్టు రెండు మ్యాచులు గెలిచినా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. జూలైలో లండన్‌లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడతాయి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా...
‘సిడ్నీ గ్రౌండ్‌లో పరిస్థితులు ఇండియాకి దగ్గరగా ఉంటాయి. ఫాస్ట్ బౌలింగ్, రివర్స్ స్వింగ్ కంటే ఎక్కువగా స్పిన్ బౌలర్లకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మా బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌ని ఎక్కువగా ఫేస్ చేయబోతున్నారు...
Pat Cummins with David Warner
లండన్‌లో తటస్థ వేదికపై ఇండియాతో ఫైనల్ మ్యాచ్ ఆడడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గత సీజన్‌లో ఫైనల్ ఆడే ఛాన్స్‌ని తృటిలో కోల్పోయాం. అందుకే ఈసారి ఎలాగైనా ఫైనల్ ఆడాలని ఫిక్స్ అయ్యాం...
Australia vs India
లండన్‌లో తటస్థ వేదికపై ఇండియాతో ఫైనల్ మ్యాచ్ ఆడడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గత సీజన్‌లో ఫైనల్ ఆడే ఛాన్స్‌ని తృటిలో కోల్పోయాం. అందుకే ఈసారి ఎలాగైనా ఫైనల్ ఆడాలని ఫిక్స్ అయ్యాం...
ఇప్పటికైతే మా ఆటతీరుతో సంతృప్తిగానే ఉన్నాం. ఇంగ్లాండ్‌లో యాషెస్ సిరీస్ ఆడనప్పుడు వచ్చే కిక్ కంటే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడడం చాలా పెద్ద విషయం...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో ఫిబ్రవరి 9న తొలి టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 17న ఢిల్లీలో రెండో టెస్టు, మార్చి 1న ధర్మశాలలో మూడో టెస్టు, అహ్మదాబాద్‌లో మార్చి 9 నుంచి ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడతాయి ఇండియా, ఆస్ట్రేలియా...