MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నువ్వే నెక్ట్స్ కెప్టెన్ అన్నాడు! 2 నెలల్లో టీమ్ నుంచి తీసేశారు... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

నువ్వే నెక్ట్స్ కెప్టెన్ అన్నాడు! 2 నెలల్లో టీమ్ నుంచి తీసేశారు... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

టన్నుల్లో టాలెంట్, బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా... టీమిండియాలో సరైన గౌరవం దక్కించుకోలేకపోయాడు వీరేంద్ర సెహ్వాగ్. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న అతి కొద్ది మందిలో ఒక్కడైన వీరూ... కెరీర్ చివర్లో టీమ్‌లో చోటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 22 2023, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Virender Sehwag

Virender Sehwag

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియాలో ఓపెనర్‌గా ఎదిగి, సచిన్ టెండూల్కర్‌తో కలిసి రికార్డు భాగస్వామ్యాలు నెలకొల్పిన వీరేంద్ర సెహ్వాగ్, ఆ తర్వాత గౌతమ్ గంభీర్‌తో కలిసి టీమ్‌కి ఎన్నో విజయాలు అందించాడు. 2003 నుంచి 2012 మధ్య తాత్కాలిక సారథిగా 12 మ్యాచులు ఆడాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించిన అప్పటి టీమిండియా హెడ్ కోచ్ గ్రెగ్ ఛాపెల్, రాహుల్ ద్రావిడ్‌ని కెప్టెన్‌గా నియమించాడు. ఆ సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే సెహ్వాగ్‌ని పక్కనబెట్టి, మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ...
 

38
Sehwag-Ganguly

Sehwag-Ganguly

‘గ్రెగ్ ఛాపెల్ హెడ్ కోచ్‌గా వచ్చిన సమయంలో చెప్పిన మొదటి స్టేట్‌మెంట్, టీమిండియాకి తర్వాతి కెప్టెన్ సెహ్వాగ్ అని.. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు. 2 నెలలకే నన్ను టీమ్ నుంచి తప్పించారు. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో ఉన్న నన్ను, కెప్టెన్ కాకుండా రాజకీయం చేశారు...

48
Virender Sehwag

Virender Sehwag

నేను ఎప్పుడూ  భారత క్రికెట్ జట్టుని నడిపించాలంటే మంచి కోచ్ కావాలని అనుకునేవాడిని. అయితే మనదగ్గర ఎవ్వరికీ చేతకానట్టు ఫారిన్ కోచ్‌లను తెచ్చుకోవడం దేనికి. ఫారిన్ కోచ్‌ల అవసరం ఏముంది? నేను ఆడే సమయంలో కూడా నా సీనియర్లను ఇదే అడిగాను...

58

‘జాన్ రైట్ తర్వాత మళ్లీ మనకో మరో ఫారిన్ కోచ్ అవసరమా?’ అని అడిగాను. వాళ్లంతా కూడా భారత కోచ్‌లతో చాలా రోజులు పని చేశారు. వాళ్లతో ఫ్రీగా మాట్లాడుకునేందుకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. అయితే భారత కోచ్‌లు ఉంటే వాళ్లు, వాళ్లకి నచ్చిన ప్లేయర్లనే టీమ్‌లో ఆడిస్తారు..

68

కొందరికి కొందరు ప్లేయర్లు ఫెవరెట్లుగా ఉంటారు. వాళ్ల కోసం మిగిలిన వాళ్లను పక్కనబెడతారు. ఫారిన్ కోచ్ వస్తే అలా కాదు, టీమ్‌లో ఉండడానికి ఎవరు అర్హులో వారినే ఆడిస్తారు.. అని సీనియర్లు సమాధానం ఇచ్చారు. కానీ నిజానికి ఫారిన్ కోచ్‌లు కూడా ఫ్రెషర్ ఫీల్ అయ్యేవాళ్లు..

78

టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్న టీమ్‌ని నడిపించడం చిన్న విషయం కాదు. నా వరకైతే టీమిండియాకి కోచ్ అవసరమే లేదు. స్టార్ ప్లేయర్లు ఉన్న జట్టుకి కావాల్సింది సరైన మ్యాన్ మేనేజర్...
 

88

అందరు ప్లేయర్లతో స్నేహాన్ని ఏర్పరచుకుని, ఏ ప్లేయర్‌కి ఎంత కోచింగ్ కావాలో తెలిసిన వ్యక్తి. ఏ ప్లేయర్‌కి ఎలా చెబితే అర్థం అవుతుందో ఎరిగిన మేనేజర్ కావాలి. ఈ విషయంలో గ్యారీ కిర్‌స్టన్ బెస్ట్. అతను నాతో 50 బాల్స్ ఆడించేవాడు. ద్రావిడ్, సచిన్‌లతో 200 బాల్స్ ఆడించేవాడు. ఆ తర్వాత బ్రేక్ ఇచ్చేవాడు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image2
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Recommended image3
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved