- Home
- Sports
- Cricket
- ఆ హెడ్ కోచ్, నన్ను గల్లా పట్టుకుని కొట్టాడు... షాకింగ్ విషయం బయటపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్..
ఆ హెడ్ కోచ్, నన్ను గల్లా పట్టుకుని కొట్టాడు... షాకింగ్ విషయం బయటపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్..
జాన్ రైట్ హెడ్ కోచింగ్‌లో, 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అండర్ డాగ్స్‌గా బరిలో అద్భుత విజయాలతో ఫైనల్‌కి దూసుకెళ్లింది టీమిండియా. దీనికి ముందు ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ని ఓడించి నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచింది. అయితే ఈ సమయంలో కోచ్ జాన్‌రైట్‌తో జరిగిన ఓ సంఘటనను బయటపెట్టాడు వీరేంద్ర సెహ్వాగ్..

‘‘టీమిండియాలోకి వచ్చిన కొత్తలో నేను భారీ షాట్లు ఆడాలనే త్వరగా అవుట్ అయ్యేవాడిని. అంతకుముందు మూడు- నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కూడా అదే విధంగా అవుట్ అయ్యాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో 203 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్నాం..
బ్యాటింగ్‌కి వెళ్లడానికి ముందే జాన్ రైట్ నన్ను పిలిచి, ‘40 ఓవర్లు బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేసినా సరే. త్వరగా మాత్రం అవుట్ కావద్దు. నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు...’ అని చెప్పాడు..
నాకు అప్పట్లో అంతగా ఇంగ్లీష్ వచ్చేది కాదు, ఆయన ఏం చెప్పాడో కూడా నాకు అర్థం కాలేదు. టీమ్‌లో ప్లేస్ పోతుందని హెచ్చరిస్తున్నారని అస్సలు అనుకోలేదు..
ఆ మ్యాచ్‌లో 10-12 పరుగులు చేసి ఎప్పటిలాగే బిగ్ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాను. అవుటై డ్రెస్సింగ్ రూమ్‌కి రాగానే ఆయన నా కాలర్ పట్టుకుని లాగి, ఛైర్‌లోకి దొబ్బేశాడు. ఆయన చేసిన దానికి ఒక్కసారిగా షాక్ అయ్యాను..
నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే టీమ్ మేనేజర్ రాజీవ్ శుక్లా దగ్గరికి వెళ్లి, నేను ఇంటికి వెళ్లిపోతానని చెప్పాను. ఆయన ఏం అయ్యిందని అడిగాడు. అప్పుడు ‘ఆ తెల్లోడు నన్ను కొట్టాడు, నన్ను ఎలా కొడతాడు? ఈ తెల్లోళ్లు మనల్ని ఎన్నో ఏళ్లు పాలించారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు..’ అని ఆవేశంగా అన్నాను.
ఆ తర్వాత మేం ఓవల్ నుంచి లుంలీ కాస్టల్‌కి వెళ్లాం. అక్కడ టీమ్ మీటింగ్‌లో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ జాన్ రైట్, సెహ్వాగ్ మధ్య ఏం జరిగిందో అది టీమ్‌లోనే ఉండాలి, ఎవ్వరూ బయటికి చెప్పకూడదని చెప్పాడు..
Virender Sehwag
అలా ఎవ్వరూ ఆ విషయం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు అయితే ఓ కోచ్, ఎవరైనా ప్లేయర్‌లా అలా ప్రవర్తిస్తే అది పెద్ద సన్సేషన్ అయిపోతుంది. మీడియా, సోషల్ మీడియాలో పెను దుమారం లేస్తుంది..
అయితే ఆ తర్వాత జాన్ రైట్ ఎందుకు అలా చెప్పారో అర్థమైంది. ఆయన కోచింగ్‌లో ఆడడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. నిజానికి నేను ఇంత సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించడానికి కారణం ఆయనే...’’ అంటూ మాజీ భారత టీమ్ మేనేజర్ అమిత్ మథుర్ రాసిన ‘పిచ్‌సైడ్: మై లైఫ్ ఇండియన్ క్రికెట్’ పుస్తకావిష్కర కార్యక్రమంలో కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్..