- Home
- Sports
- Cricket
- నా కొడుకు కూడా ఐపీఎల్ ఆడతానని అంటున్నాడు! ఏం చేసేది... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...
నా కొడుకు కూడా ఐపీఎల్ ఆడతానని అంటున్నాడు! ఏం చేసేది... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...
సినిమాల్లో నెపోటిజం గురించి చాలా పెద్ద చర్చే జరుగుతోంది. అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ దాకా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న హీరోహీరోయిన్లలో మెజారిటీ శాతం మంది, వారసత్వం ద్వారా సినిమాల్లోకి వచ్చినవాళ్లే. క్రికెట్‌లో మాత్రం ఇది పెద్దగా వర్కవుట్ కాలేదు... కానీ లక్ వెతుక్కుంటున్న వారసుల సంఖ్య మాత్రం తక్కువేమీ లేదు..

రోజర్ బిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీ, సునీల్ గవాస్కర్ కొడుకు రోహాన్ గవాస్కర్ క్రికెట్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. మహ్మద్ అజారుద్దీన్ కొడుకు మహ్మద్ అసదుద్దీన్, దేశవాళీ టోర్నీల్లో అవకాశాలు రాబట్టుకోవడానికే బాగా కష్టపడుతున్నాడు...
Arjun Tendulkar
‘క్రికెట్ గాడ్’గా రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా ముంబై టీమ్‌లో ఛాన్సులు రావడం లేదని గోవా టీమ్ తరుపున ఆడుతున్నాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు కూడా క్రికెట్‌లో ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాడట...
‘ఐపీఎల్‌కి క్రేజ్ మరో లెవెల్‌కి వెళ్లిపోయింది. అన్ని దేశాల క్రికెటర్లు జీవితంలో ఒక్కసారైనా ఐపీఎల్‌లో ఆడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఐపీఎల్‌లో ఇచ్చే పర్ఫామెన్స్ వారి కెరీర్‌నే మార్చేస్తుంది...
డేవిడ్ వార్నర్‌నే తీసుకోండి. ఐపీఎల్‌లో బాగా ఆడి, ఆస్ట్రేలియా టీమ్‌కి సెలక్ట్ అయ్యాడు. స్టార్ ప్లేయర్ అయ్యాడు. చిన్న పట్టణాలు, మారుమూల గ్రామాల నుంచి వచ్చే క్రికెటర్లకు ఐపీఎల్ అనేది ఓ ప్రపంచ స్థాయి వేదిక...
Image credit: PTI
కుర్రాళ్లకు కూడా ఐపీఎల్ చాలా కీలకంగా మారిపోయింది. ఎందుకంటే రంజీ ట్రోఫీలో ఎంత బాగా ఆడినా సెలక్టర్లు కూడా పట్టించుకోవడం లేదు. ఐపీఎల్‌లో ఆడితేనే ప్రపంచానికి తెలుస్తాం.. టీమిండియా తరుపున ఆడతాం.. అనే నమ్మకం ప్లేయర్లలో నిండిపోయింది..
ఐపీఎల్ ఆడొచ్చనే ఉద్దేశంతోనే చాలామంది కుర్రాళ్లు, క్రికెట్‌ని కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. క్రికెట్‌లో కెరీర్ ఉండదని భయపడిన వాళ్లు, ఇప్పుడు ఐపీఎల్ ఉందనే ధైర్యంతో పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. అంతెందుకు మా అబ్బాయి ఆర్యవీర్‌నే తీసుకోండి. వాడికి 15 ఏళ్లు. ఇప్పటి నుంచే ఐపీఎల్ ఆడాలని ఫిక్స్ అయిపోయి, విపరీతంగా కష్టపడుతున్నాడు...
Image credit: PTI
సచిన్ టెండూల్కర్, షాన్ పోలాక్, షేన్ వార్న్ వంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసే అవకాశం అనామక క్రికెటర్లకు దొరుకుతుంది. ఐపీఎల్ ఆ అవకాశం కల్పించింది. కుర్రాళ్ల ఆటను తమ కుటుంబాలు కూర్చొని చూసేలా చేసింది...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..