మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ కంటే గోల్ఫ్ బాగా ఆడతాడు... డబ్బులు తీసుకుంటూ, డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తాడు...
First Published Dec 9, 2020, 5:39 PM IST
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున 13 మ్యాచులు ఆడిన మ్యాక్స్‌వెల్... ఒక్కటంటే ఒక్క సిక్స్‌కూడా బాదలేదు. దీంతో మ్యాక్స్‌వెల్‌ను పదికోట్ల ఖరీదైన ఛీర్ లీడర్ అంటూ విమర్శించాడు వీరేంద్ర సెహ్వాగ్. అయితే ఆ తర్వాత ప్రారంభమైన వన్డే, టీ20 సిరీస్2లో మాత్రం తన తడాఖా చూపించాడు మ్యాక్స్‌వెల్. మరోసారి మ్యాక్స్‌వెల్‌ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించాడు వీరూ.

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడిన 13 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కటంటే ఒక్క సిక్సర్ బాదలేకపోయిన మ్యాక్స్‌వెల్... మొత్తంగా కలిపి 108 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

మ్యాక్స్‌వెల్ ఫెయిల్ కావడం వల్లే కొన్ని ఉత్కంఠ మ్యాచుల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఆఖర్లో విజయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే మ్యాక్స్‌వెల్ ఫామ్ కోల్పోలేదని ఇండియా, ఆసీస్ టూర్‌లో స్పష్టమైంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?