సూపర్ కార్లు, లగ్జరియస్ హౌస్.. సెహ్వాగ్‌కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
Virender Sehwag Net Worth: విడాకుల పుకార్ల మధ్య వీరేంద్ర సెహ్వాగ్, భార్య ఆర్తి ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ మాజీ భారత స్టార్ ప్లేయర్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

Virender Sehwag Net Worth: భారత క్రికెట్ లో వరుసగా వస్తున్న విడాకుల వార్తలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా భారత ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, అతని భార్య ఆర్తీ అహ్లావత్ 20 ఏళ్ల పాటు కలిసి సాగిన తర్వాత ఇప్పుడు విడిపోతున్నారనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. 2004లో సెహ్వాగ్ ఆర్తి అహ్లావత్‌ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని కూడా పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Image Credit: Instagram/Virender Sehwag
వీరేంద్ర సెహ్వాగ్ సునామీ బ్యాటింగ్
భారత మాజీ క్రికెటర్, ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన పేలుడు బ్యాటింగ్ శైలికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. క్రీజులో అడుగుపెట్టిన తొలి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగులు సాధించే సామర్థ్యంతో కీర్తిని పొందాడు. అతని దూకుడు విధానం అతన్ని ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వినోదాత్మక, స్టార్ ఓపెనర్‌లలో ఒకరిగా చేసింది.
విడాకుల పుకార్లతో వార్తల్లో నిలిచిన సెహ్వాగ్
సెహ్వాగ్ కొన్నాళ్ల క్రితమే క్రికెట్‌కు రిటైరైనప్పటికీ, విడాకుల పుకార్ల కారణంగా మరోసారి వార్తలో హాట్ టాపిక్ గా మారాడు. సెహ్వాగ్, అతని భార్య ఆర్తి 20 సంవత్సరాల వివాహం తర్వాత విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వార్త మీడియాలో, అభిమానుల్లో సంచలనం సృష్టించింది.
సోషల్ మీడియాతో మొదలైన పుకార్లు
మీడియా నివేదికల ప్రకారం, సెహ్వాగ్, ఆర్తీ ఒకరినొకరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అన్‌ఫాలో చేసుకున్నారు. ఇది వారి విడాకుల పై మరింత ఊహాగానాలు పెంచింది. సెహ్వాగ్ లేదా ఆర్తి ఈ వార్తలను బహిరంగంగా ధృవీకరించనప్పటికీ, ఈ జంట చాలా నెలలుగా విడివిడిగా జీవిస్తున్నట్లు కూడా పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
విడాకులతో ఆర్థిక చిక్కులు
ఒకవేళ ఈ జంట విడాకుల వరకు వెళితే, సెహ్వాగ్‌కు ఆర్థికపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సెహ్వాగ్ తన సంపదలో భారీగానే ఆర్తి వాటా పొందవచ్చని సమాచారం. సెహ్వాగ్ పదవీ విరమణ తర్వాత గణనీయమైన ఆస్తులను కూడబెట్టుకున్నందున, ఇది అతని ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత వెంచర్లు.. భారీగానే ఆస్తులు
2015లో క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అయిన తర్వాత సెహ్వాగ్ తన సంపదను పెంచుకోవడానికి అనేక వెంచర్లను కొనసాగించాడు. అతను కోచింగ్, కామెంటరీ, ఇతర వ్యాపారాల్లో అడుగుపెట్టారు. ఇక్కడి నుంచి భారీగానే సంపాదిస్తున్నారు. క్రికెట్ కెరీర్ కొనసాగిస్తున్న సమయలో ఎంత సంపాదించేవారో ఇప్పుడు కూడా సెహ్వాగ్ సంపదను ఆర్జిస్తున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతానికి, సెహ్వాగ్ నికర విలువ ₹340 నుండి ₹350 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. భారతదేశంలోని అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒకరిగా, దేశంలో ఐదవ అత్యంత సంపన్న ఆటగాడిగా సెహ్వాగ్ ఉన్నారని రిపోర్టులు సమాచారం.
Virender Sehwag
సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లు కలిగిన సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లో విలాసవంతమైన ఇంటిని కలిగి ఉన్నారు. ఇది అతని ఆకట్టుకునే ఖరీదైన ఆస్తుల జాబితాలో ఒకటి. అతని వద్ద లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. బెంట్లీ, BMW 5 సిరీస్‌తో సహా అనేక హై-ఎండ్ కార్లు సెహ్వాగ్ గ్యారేజీలో ఉన్నాయి. హర్యానాలోని సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ని కలిగి ఉన్నారు. ఇది అతని ఆదాయాన్ని మరింత పెంచుతుంది.