Virat Kohli: విరాట్ కోహ్లీ.. భారత జట్టులో ఎప్పటికీ కింగే !
Champions Trophy 2025 Virat Kohl: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లో కూడా అద్భుతం చేస్తూ సూపర్ క్యాచ్ లను అందుకున్నాడు విరాట్ కోహ్లీ. మరో ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించి భారత క్రికెట్ లో ఎప్పటికీ కింగ్ అని మరోసారి నిరూపించాడు.

Virat Kohli: భారత జట్టుకు అనేక అద్భుతమైన విజయాలు అందించిన కోహ్లీ పరుగుల వేట కొనసాగుతూనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మరోసారి తన అద్భుతమైన ఆటతో భారత జట్టు ఐసీసీ ట్రోఫీని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అవసరమైన సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జైత్రయాత్రను సాగించడంతో తనదైన పరుగుల వేటను కొనసాగించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అనేక మైలురాళ్లు అందుకున్న కింగ్ కోహ్లీ ఈ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన 5వ ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఐసీసీ టోర్నీలో కోహ్లీ 5 మ్యాచ్ లను ఆడి 54.58 సగటుతో 218 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఆడిన సెంచరీ ఇన్నింగ్స్ భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకంటే అతని సెంచరీ దాయాది దేశమైన పాకిస్తాన్ పై వచ్చింది. ఈ టోర్నీలో క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మ్యాచ్ భారత్-పాకిస్తాన్ గ్రూప్ దశ మ్యచ్. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 241 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లకు తోడుగా విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ పవర్ ను చూపించాడు.అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ తో భారత జట్టుకు విజయాన్ని అందించాడు. 100 పరుగుల తన ఇన్నింగ్స్ తో మరోసారి పాకిస్తాన్ పై తన బ్యాట్ పవర్ ను చూపించాడు.

Rohit Sharama-Virat Kohli
మొత్తంగా విరాట్ కోహ్లీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చేసిన పరుగులను గమనిస్తే తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విరాట్ కోహ్లీ 22 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఐసీసీ టోర్నీలో హై వోల్టేజీ మ్యాచ్ భారత్-పాకిస్తాన్ మధ్య జరిగింది. రెండు దేశాల మ్యాచ్ అంటే ఉండే ఉత్సాహం.. మజానే వేరు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఉంచిన 241 పరుగుల టార్గెట్ ను అందుకునే క్రమంలో కింగ్ కోహ్లీ అద్భుతమైన సెంచరీని పూర్తి చేయడంతో పాటు భారత జట్టుకు విజయాన్ని అందించాడు. దాయాది దేశాన్ని టోర్నీని ఇంటికి పంపించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు తన మూడో మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడింది. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ మంచి టచ్ లో కినిపించాడు. రెండు ఫోర్లతో ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు కానీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. 11 పరుగు వద్ద అవుట్ అయ్యాడు. అయితే, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాల మంచి ఇన్నింగ్స్ లతో భారత్ గ్రూప్ దశను విజయవంతంగా గెలుపులతో పూర్తి చేసింది.
Image Credit: Getty Images
ఇక సెమీ ఫైనల్ లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన భారత్ కు విజయాన్ని అందించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 264 పరుగుల టార్గెట్ ను భారత్ ముందు ఉంచగా, త్వరగానే గిల్ వికెట్ కోల్పోయింది టీమిండియా. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ రోహిత్ తో కలిసి భారత ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ తో కలిసి మంచి భాగస్వామ్యం తో భారత్ ను గెలుపుకు దగ్గరగా తీసుకెళ్లాడు.
చివరలో కేఎల్ రాహుల్ 42 పరుగులతో మ్యాచ్ ను గెలిపించాడు. కోహ్లీ ఈ మ్యాచ్ లో 84 పరుగులతో విజయాన్ని అందించి భారత్ ను ఫైనల్ కు తీసుకెళ్లాడు. టీమిండియా మరో 2 ఓవర్లు ఉండగానే 6 వికెట్లు కోల్పోయి 267 పరుగులతో గెలిచి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో న్యూజిలాండ్ పై కోహ్లీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు కానీ, ఫీల్డింగ్ సమయంలో భారత గెలుపుకోసం రోహిత్ సేనతో గెలుపు వ్యూహాలు అమలు చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కేవలం బ్యాటింగ్ తో మాత్రమే కాదు.. ఫీల్డింగ్ లో కూడా అదుర్స్ అనిపిస్తూ సూపర్ క్యాచ్ లను అందుకున్నాడు. కింగ్ కోహ్లీ మొత్తంగా తన వన్డే కెరీర్ లో ఇప్పటివరకు 302 మ్యాచ్ లను ఆడగా, 290 ఇన్నింగ్స్ లలో 14181 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోర్ 183 పరుగులు కాగా, 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు కొట్టాడు. నేనే కింగ్ అంటూ నిరూపిస్తున్నాడు.
- Black Caps
- Champions Trophy
- Champions Trophy 2025
- Champions Trophy 2025 Virat Kohli
- Champions Trophy Final
- Cricket
- Dubai Pitch
- ICC Tournament King Kohli
- IND v NZ
- IND vs NZ
- India vs New Zealand
- Kane Williamson
- King Kohli
- Kiwis
- Matt Henry
- Mitchell Santner
- NZ v IND
- NZ vs IND
- New Zealand
- New Zealand vs India
- News in Telugu
- Rachin Ravindra
- Rohit Sharma
- Sports
- Team India
- Telugu Latest Cricket Updates
- Telugu News
- Varun Chakravarthy
- Virat Kohli
- Virat Kohli records
- champions trophy
- champions trophy 2025 india vs nz
- icc champions trophy
- icc champions trophy 2025
- icc champions trophy winner list
- ind nz
- ind vs nz final
- ind vs nz final 2025
- india new zealand final match
- india versus new zealand
- india versus new zealand final match
- india vs new zealand live
- india-new zealand match
- kane williamson
- kuldeep yadav
- most catch dropped in champions trophy 2025
- new zealand
- new zealand vs india
- nz vs ind
- team india
- today match time

