- Home
- Sports
- Cricket
- విరాట్ వర్సెస్ రోహిత్... అక్కడా ఇద్దరూ- ఇక్కడా ఇద్దరు... టీమిండియాలో ఈ ఇద్దరు కెప్టెన్ల ఫార్మాలా అచ్చివచ్చేనా
విరాట్ వర్సెస్ రోహిత్... అక్కడా ఇద్దరూ- ఇక్కడా ఇద్దరు... టీమిండియాలో ఈ ఇద్దరు కెప్టెన్ల ఫార్మాలా అచ్చివచ్చేనా
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో భారత పురుషుల జట్టుకి కూడా ఇద్దరు కెప్టెన్లు రాబోతున్నారు. ఇప్పటికే భారత మహిళా జట్టుకి హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీరాజ్ రూపంలో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు...

భారత మహిళా క్రికెట్ జట్టులో వన్డే, టెస్టులకు మిథాలీరాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే... టీ20 కెప్టెన్సీని హర్మన్‌ప్రీత్ కౌర్ చూసుకుంటోంది. ఇప్పుడు పురుషుల జట్టులో కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు ఇప్పటికే ఈ ఇద్దరు కెప్టెన్ల ఫార్ములాను వాడుతున్నాయి. అయితే అక్కడ ఈ ఫార్ములా సక్సెస్ అయినంత ఈజీగా, ఇండియాలో వర్కవుట్ కావడం కష్టం...
ఎందుకంటే ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌కి, వన్డేల్లో అప్పుడప్పుడూ పిలుపు వచ్చినా, టీ20ల్లో అతనికి చోటే ఉండదు. ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ పరిస్థితి కూడా అదే...
అలా చూసుకుంటే... విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మ టీ20 టీమ్‌లో చోటు దక్కకపోతే... టీమిండియా ఫ్యాన్స్ రెండుగా చీలిపోతారు. 13 ఏళ్లుగా టీమిండియాలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ కూడా దీన్ని ఓ అవమానంగా భావించవచ్చు...
వుమెన్స్ టీ20 వరల్డ్‌కప్ సమయంలో ఇదే విషయంలో పెద్ద గొడవే జరిగింది. మిథాలీరాజ్‌కి చోటు ఇవ్వకుండా ఆడిన మ్యాచ్‌లో టీమిండియా ఓడడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మిథాలీ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది...
ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ అయితే, ఆ జట్టులో విరాట్ కోహ్లీకి కచ్ఛితంగా చోటు ఉండాలి. టీ20 కెప్టెన్సీ, రోహిత్‌కి పెద్ద కష్టమేమీ కాదు... ఇంతకుముందు కూడా కోహ్లీని పక్కనేబెట్టుకుని రోహిత్ ఫీల్డింగ్ సెట్ చేసేవాడు...
కాకపోతే మిగిలిన ప్లేయర్లతోనే ఇబ్బంది. కోహ్లీ చెప్పినట్టు వింటే రోహిత్ కెప్టెన్సీలోని టీ20ల్లో చోటు దక్కదు? రోహిత్ చెప్పినట్టు వింటే వన్డే, టెస్టు ఫార్మాట్లలో చోటు వదులుకోవాల్సిందే అనే ఓ రకమైన అభిప్రాయం ప్లేయర్లలో కలుగుతుంది...
ఈ నిర్ణయం ఏదో టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ప్రకటించినా పోయేది... అయితే టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఓడితే, అందువల్లే కోహ్లీ తప్పుకున్నాడనే అపవాదును మోయాల్సి వచ్చేది...
అందుకే ముందుగానే తన నిర్ణయం ప్రకటించాడు కోహ్లీ. అయితే ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో కూడా విరాట్, రోహిత్ శర్మల మధ్య ఆధిపత్య పోరు ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...