- Home
- Sports
- Cricket
- వాళ్లిద్దరి వల్లే ఆర్సీబీ ఇలా ఉంది.. కోహ్లి అయితే అంతే సంగతులు.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
వాళ్లిద్దరి వల్లే ఆర్సీబీ ఇలా ఉంది.. కోహ్లి అయితే అంతే సంగతులు.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
IPL 2022 Playoffs: ఐపీఎల్-15 లో ముంబై ఇండియన్స్ పుణ్యమా అని ప్లేఆఫ్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లిని టార్గెట్ చేస్తూ వీరూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ సీజన్ లో పడుతూ లేస్తూ ప్లేఆఫ్స్ కు చేరిన నాలుగో జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తొలి ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా ఆర్సీబీ.. బుధవారం (మే 25న) ఈడెన్ గార్డెన్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనున్నది.
అయితే ఆర్సీబీకి ఈ ఏడాది కొత్తగా వచ్చిన హెడ్ కోచ్ సంజయ్ బంగర్, కొత్త సారథి ఫాఫ్ డుప్లెసిస్ వల్ల ఆ జట్టు నిలకడగా రాణించగలుగుతుందని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. పాత సారథి విరాట్ కోహ్లి ఎప్పుడూ ఆటగాళ్లను మార్చేవాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
వీరూ మాట్లాడుతూ... ‘సంజయ్ బంగర్ హెడ్ కోచ్ అవడం.. కొత్త సారథి ఫాఫ్ డుప్లెసిస్ చేరడంతో ఆర్సీబీ వ్యూహాలు, ఆలోచనా విధానంలో మార్పులు తీసుకువచ్చింది. గతంలో విరాట్ కోహ్లి ఎవరైనా ఆటగాడు రెండు మూడు మ్యాచులలో ఆడకుంటే పక్కనబెట్టేవాడు.
కానీ బంగర్-డుప్లెసిస్ అలా కాదు. ఈ సీజన్ లో అనూజ్ రావత్, రజత్ పాటిదార్ ను తప్పితే పెద్దగా ఆటగాళ్ల ను మార్చినట్టు కనిపించలేదు. సరిగా ఆడలేదనే కారణంతో కూడా ఆటగాళ్లను పక్కనబెట్టలేదు. అందుకే ఆ జట్టు నిలకడగా రాణిస్తున్నది..’అని క్రిక్ బజ్ తో చిట్ చాట్ సందర్భంగా వీరూ వ్యాఖ్యానించాడు.
ఈ సీజన్ లో ఆర్సీబీ.. ఆటగాళ్లపై నమ్మకముంచి వారి నుంచి మంచి ఫలితాలను రాబట్టింది. మహిపాల్ లోమ్రర్, రజత్ పాటిదార్, షాబాజ్ అహ్మద్ ఆ విధంగానే సక్సెస్ అయ్యారు.
కోహ్లి కూడా ఈ సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శల పాలై ఒకానొక సమయంలో జట్టుకు భారంగా మారినా అతడిపై యాజమాన్యం నమ్మకముంచింది. మూడు సార్లు గోల్డెన్ డకౌట్ అయినా.. పలుమార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగినా కోహ్లిని కొనసాగించింది.
ఈ సీజన్ లో ఆర్సీబీ ఆడిన 14 మ్యాచులలో 8 గెలిచి 16 పాయింట్లతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకుంది. 15 సీజన్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ టైటిల్‌ను ఈసారైనా ఎలాగైనా గెలవాలని ఉవ్విళ్లూరుతున్నది. మరి ఆర్సీబీకి ఆ సత్తా ఉందా..? లేదా..? అనేది రేపు తేలుతుంది.