విరాట్ కోహ్లీ, తొలి టెస్టులో అంపైర్లను భయపెట్టాలని చూశాడు... ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణ...

First Published Feb 9, 2021, 4:29 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 227 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. 420 పరుగుల భారీ లక్ష్యచేధనలో భారత సారథి విరాట్ కోహ్లీ, యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ ఒంటరి పోరాటం చేసినా, ఫలితం దక్కలేదు. ఇంగ్లాండ్‌తో పోలిస్తే, తమ జట్టు ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్, పోరాటం ఏ మాత్రం సరిపోలేదని ఒప్పుకున్నాడు కోహ్లీ. అయితే కోహ్లీపై సంచలన ఆరోపణలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్.