- Home
- Sports
- Cricket
- షారుక్, సల్మాన్, అక్షయ్ కుమార్‌లను వెనక్కినెట్టిన విరాట్ కోహ్లీ... 2021 గూగుల్ సెర్చ్‌లో...
షారుక్, సల్మాన్, అక్షయ్ కుమార్‌లను వెనక్కినెట్టిన విరాట్ కోహ్లీ... 2021 గూగుల్ సెర్చ్‌లో...
విరాట్ కోహ్లీ క్రేజ్‌కి మరో ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన. ఇంతకుముందులా పరుగుల ప్రవాహం రాకపోయినా, రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోకపోయినా విరాట్ కోహ్లీ ఫాలోయింగ్, క్రేజ్, స్టార్ ఇమేజ్ మాత్రం తగ్గడం లేదు...

2021 ఏడాదిలో గూగుల్‌లో అత్యధిక సార్లు సెర్చ్ చేసిన భారతీయుడిగా టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ. బాలీవుడ్ హీరోలు కూడా విరాట్ కోహ్లీ కంటే వెనకే ఉండడం విశేషం...
ప్రపంచంలో మోస్ట్ అడ్మర్డ్ సెలబ్రిటీల లిస్టులో 18వ స్థానం దక్కించుకున్న విరాట్ కోహ్లీ, ఆసియాలో అత్యధిక మంది వెతికిన పురుష సెలబ్రిటీగానూ టాప్‌లో నిలిచాడు...
ప్రపంచంలో అత్యధిక మంది వెతికిన క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలోనూ అత్యధిక మంది ఫాలోవర్లను సంపాదించుకున్న సెలబ్రిటీల జాబితాలో టాప్ 3లో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే.
అయితే ఓవరాల్‌గా బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి చెక్కేసిన హీరోయిన్ ప్రియాంక చోప్రా... గూగుల్‌లో అత్యధిక సార్లు సెర్చ్ చేసిన భారత సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ కంటే ముందుంది...
బాలీవుడ్ ‘కింగ్’ ఖాన్ షారుక్ ఖాన్... 2021లో గూగుల్‌లో అత్యధిక సార్లు సెర్చ్ చేసిన రెండో భారత పురుష సెలబ్రిటీగా నిలిచాడు. షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో ఈ బాలీవుడ్ బాద్‌షా గురించి తెగ వెతికారట నెటిజన్లు...
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, 2021 ఏడాదిలో గూగుల్‌లో మోస్ట్ సర్చ్‌డ్ ఇండియన్ మేల్ సెలబ్రిటీ లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు. కత్రీనా కైఫ్ పెళ్లితో పాటు ‘రాధే’, ‘అంటిమ్: ది ఫైనల్ ట్రూత్’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు సల్మాన్..
ఈ ఏడాది ‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’ వంటి రెండు బ్లాక్ బస్టర్ మూవీస్‌తో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ ‘యాక్షన్ ఖిలాడీ’ అక్షర్ కుమార్, 2021లో గూగుల్ అత్యధిక మంది వెతికిన భారత మేల్ సెలబ్రిటీ లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు...
అయితే బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్, అక్షర్ కుమార్ కంటే ముందు స్థానంలో నిలిచింది. ఆసియాలో అత్యధిక మంది వెతికిన భారతీయ మహిళా సెలబ్రిటీల లిస్టులో ప్రియాంక చోప్రా తర్వాతి స్థానంలో నిలిచింది కరీనా... ఈ ఏడాది ఆరంభంలో రెండో బిడ్డకు జన్మనివ్వడంతో కరీనా గురించి తెగ వెతికారట నెటిజన్లు...
2021 గూగుల్ సెర్చ్‌లో భారత్‌లో అత్యధిక మంది వెతికిన భారత క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు ఎమ్మెస్ ధోనీ. ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎస్‌కే టైటిల్ గెలవడంతో పాటు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియాకి మెంటర్‌గానూ వ్యవహరించాడు మహేంద్ర సింగ్ ధోనీ...
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ నుంచి టీ20 కెప్టెన్సీ, వన్డే కెప్టెన్సీ అందుకున్న భారత ఓపెనర్, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... 2021 ఏడాది మోస్ట్ సెర్చ్‌డ్ క్రికెటర్ల జాబితాలో మూడో స్థానం దక్కింది...
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కి ఈ జాబితాలో నాలుగో స్థానం దక్కింది. ఈ ఏడాది ప్రారంభంలో రైతుల దీక్ష గురించి పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్‌పై సచిన్ టెండూల్కర్... ‘అంతర్గత విషయాలపై ఇతరుల జోక్యాన్ని సహించం’ అంటూ వేసిన ట్వీట్, అప్పట్లో పెను దుమారం రేపిన విషయం తెలిసిందే...