విరాట్ భయ్యా చెప్పడం వల్లే నేను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చా... - ఇషాన్ కిషన్
రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అతని స్థానంలో శ్రీకర్ భరత్‌కి ఆరు మ్యాచుల్లో అవకాశం ఇచ్చింది బీసీసీఐ. ఆస్ట్రేలియా టాప్ క్లాస్ బౌలింగ్ లైనప్‌ని ఎదుర్కొన్న శ్రీకర్ భరత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు... అయితే ఫామ్‌లో లేని వెస్టిండీస్ బౌలర్లపై ప్రతాపం చూపించిన ఇషాన్ కిషన్, అవకాశాన్ని సరిగ్గా వాడుకున్నాడు..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ టూర్‌లో రెండు టెస్టుల్లోనూ ఇషాన్ కిషన్‌కి అవకాశం కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్..
Virat Kohli and Ishan Kishan
మొదటి టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇషాన్ కిషన్, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్‌కి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ దక్కింది..
Rishabh Pant and Ishan Kishan
టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ఆరో భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్.. ఇంతకుముందు 1956లో నరేన్ తమ్‌హారే, 1960లో బుది కుందేరన్, 1971లో ఫరూక్ ఇంజనీర్, 1978లో సయ్యద్ కిర్మణీ (రెండు సార్లు), 2001లో నయన్ మోంగియా... టెస్టుల్లో టీమిండియా తరుపున నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్లుగా నిలిచారు.
2018లో పార్థివ్ పటేల్, మురళీ విజయ్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. ఆ తర్వాత టాప్ 4లో బ్యాటింగ్‌కి వచ్చిన భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషనే.. 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, టెస్టుల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
‘ఇది చాలా స్పెషల్. టీమ్ నా నుంచి ఏం ఆశిస్తుందో నాకు బాగా తెలుసు. టీమ్‌లో ప్రతీ ఒక్కరూ నాకు అండగా నిలిచారు. ముఖ్యంగా విరాట్ భాయ్ వల్లే నాకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ దక్కింది..
వెళ్లి నీ ఆట చూపించమని నన్ను ప్రోత్సహించి పంపించారు. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ బౌలింగ్ చేస్తుండడంతో నాకు బ్యాటింగ్ ఈజీ అయిపోయింది. అప్పుడప్పుడూ టీమ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది..వర్షం ఆగిన తర్వాత 10-12 ఓవర్లు ఆడాలనుకున్నాం..
Ishan KIshan
కనీసం 70-90 పరుగులు జత చేస్తే వెస్టిండీస్‌కి 370-380 స్కోరు పెట్టవచ్చని భావించాం. ఇక్కడికి రావడానికి ముందు ఎన్‌సీఏలో రిషబ్ పంత్‌ని కలిశాను. ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు. అండర్19 నుంచే ఇద్దరం కలిసి ఆడుతున్నాం... రిషబ్ పంత్ ఇచ్చిన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్..