MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • చెత్త రికార్డు కోసం కోహ్లీ పోటీ.. రోహిత్, గంగూలీలను దాటేశాడు !

చెత్త రికార్డు కోసం కోహ్లీ పోటీ.. రోహిత్, గంగూలీలను దాటేశాడు !

Indian Players With Most Ducks: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక్క పరుగు కూడా చేయకుండా డక్ అయ్యాడు. చెత్త రికార్డును తన పేరుమీద రాసుకున్నాడు. రోహిత్ శర్మ, గంగూలీలను అధిగమించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 19 2025, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెర్త్ లో విరాట్ కోహ్లీ డక్‌
Image Credit : ANI

పెర్త్ లో విరాట్ కోహ్లీ డక్‌

చాలా కాలం తర్వాత భారత్ తరఫున గ్రౌండ్ లోకి దిగిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. ఆదివారం (అక్టోబర్ 19న) ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో కోహ్లీ ఎనిమిది బంతులు ఆడి ఒక్క పరుగు చేయకుండానే అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రోహిత్, గంగూలీలను దాటేసిన కోహ్లీ
Image Credit : ANI

రోహిత్, గంగూలీలను దాటేసిన కోహ్లీ

ఈ అవుట్‌తో విరాట్ కోహ్లీ ఒక చెత్త రికార్డు జాబితాలోకి చేరాడు. వన్డేల్లో కోహ్లీ ఇప్పటివరకు 17 సార్లు డక్ అయ్యాడు. దీంతో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ లను అధిగమించాడు. గంగూలీ 2008లో రిటైర్ అయ్యే సరికి 16 సార్లు డక్ అయ్యాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 16 సార్లు డక్ అయ్యాడు. రోహిత్ కూడా పెర్త్ వన్డేలో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు.

35
వన్డేల్లో అత్యధిక డక్స్- భారత ప్లేయర్లు
Image Credit : X

వన్డేల్లో అత్యధిక డక్స్- భారత ప్లేయర్లు

భారత జట్టులో అత్యధిక సార్లు వన్డేల్లో డక్ అయిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్. 463 వన్డేల్లో 20 సార్లు ఆయన ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత స్థానంలో జవగల్ శ్రీనాథ్‌ ఉన్నాడు. ఆయన 19 సార్లు డక్ అయ్యాడు. మూడో స్థానంలో యూవరాజ్ సింగ్, అనిల్ కుంబ్లేలు 18 డక్స్‌తో ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పుడు విరాట్ కోహ్లీ 17 డక్స్‌తో ఐదవ స్థానంలో ఉన్నాడు.

1. సచిన్ టెండూల్కర్ – 20

2. జవగల్ శ్రీనాథ్ – 19

3. యూవరాజ్ సింగ్ – 18

4. అనిల్ కుంబ్లే – 18

5. విరాట్ కోహ్లీ – 17

6. హర్భజన్ సింగ్ – 17

7. రోహిత్ శర్మ – 16

45
అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి 39వ డక్
Image Credit : ANI

అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి 39వ డక్

వన్డేల్లోనే కాదు, అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 39 సార్లు డక్ అయ్యాడు. ఈ జాబితాలో ఆయన మూడో స్థానంలో ఉన్నాడు. జహీర్ ఖాన్ 43 డక్స్‌తో టాప్ లో ఉండగా, ఇషాంత్ శర్మ 40 డక్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ తర్వాత హర్భజన్ సింగ్ (37), బుమ్రా (35), కుంబ్లే (35), రోహిత్ శర్మ (34), సచిన్ టెండూల్కర్ (34) ఉన్నారు.

భారత ఆటగాళ్లు – అన్ని ఫార్మాట్లలో అత్యధిక డక్స్

1. జహీర్ ఖాన్ – 43

2. ఇషాంత్ శర్మ – 40

3. విరాట్ కోహ్లీ – 39

4. హర్భజన్ సింగ్ – 37

5. బుమ్రా – 35

6. అనిల్ కుంబ్లే – 35

55
కోహ్లీకి ఆస్ట్రేలియాతో వన్డేల్లో మూడవ డక్
Image Credit : ANI

కోహ్లీకి ఆస్ట్రేలియాతో వన్డేల్లో మూడవ డక్

ఆస్ట్రేలియాతో వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఇది మూడవ డక్. అలాగే, మిచెల్ స్టార్క్ ఇప్పుడు కోహ్లీని రెండు సార్లు డక్‌ అవుట్ చేసిన రెండవ బౌలర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ జేమ్స్ ఆండర్సన్‌ సాధించాడు. అతను కూడా రెండు సార్లు కోహ్లీని డకౌట్ చేశాడు.

224 రోజుల తర్వాత, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు భారత జట్టు తరపున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి ఆటలోకి రావడంతో మస్తు జోష్ లో ఉన్నారు. చివరిసారి వీరిద్దరూ భారత్ తరఫున ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడారు. ఇద్దరూ టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
వన్డే అరంగేట్రంతో చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి
Recommended image2
రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు.. క్రికెట్ లెజెండ్స్ జాబితాలోకి హిట్ మ్యాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved