- Home
- Sports
- Cricket
- వాళ్లిద్దరూ పిచ్ బాగుంటేనే సెంచరీలు చేస్తారు... విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌ల గురించి పాక్ మాజీ క్రికెటర్...
వాళ్లిద్దరూ పిచ్ బాగుంటేనే సెంచరీలు చేస్తారు... విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌ల గురించి పాక్ మాజీ క్రికెటర్...
అక్కడ, ఇక్కడ అనే తేడా లేకుండా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లపై కూడా అద్భుత సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ. అయితే రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కును అందుకోలేకపోతున్నాడు. పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్.. విరాట్ గురించి, స్టీవ్ స్మిత్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు...

2019లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. 70 సెంచరీలు చేసిన విరాట్‌కి 71వ శతకం మాత్రం అందని ద్రాక్షగా ఊరిస్తూ ఉంది...
మరోవైపు మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో 2019లో 211 పరుగులు చేసిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్... ఆ తర్వాత టెస్టుల్లో సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నాడు....
ఆస్ట్రేలియా టూర్‌లో రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో 78 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, రెండో టెస్టులో 72 పరుగులు చేశాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఇద్దరూ టెస్టుల్లో 27 సెంచరీలు చేసి సమంగా ఉన్నారు. మరోవైపు జో రూట్ శతకాల మోత మోగిస్తూ 25 సెంచరీలు చేసి, వీరికి చేరువగా రాగా... విరాట్, స్మిత్ మాత్రం 28వ సెంచరీ అందుకోలేకపోతున్నారు...
‘నా ఉద్దేశంలో వాళ్లిద్దరూ చేసిన చాలా సెంచరీలు... స్వదేశంలో, ఈజీ పిచ్‌లపైన సాధించినవే. వాళ్లకి సెంచరీ చేయాలంటే మంచి పిచ్, మంచి కండీషన్స్ కావాలి...
స్టీవ్ స్మిత్ కొట్టిన రెండు బౌండరీలు చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి. అంటే అతనికి కవర్స్ కానీ, మిడ్ వికెట్ దగ్గర ఫీల్డర్లు లేకపోతే ఈజీగా పరుగులు చేసి, సెంచరీ చేయగలడు...
తన ఫెవరెట్ షాట్స్ పొజిషన్‌లో ఫీల్డర్లను పెడితే, పరుగుల రావడం ఆగిపోతుంది. పాక్‌లో ఆడేటప్పుడు ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అతను చాలా మెరుగ్గా ఆడుతున్నాడనే చెప్పాలి...
యాషెస్ సిరీస్‌లో పరుగులు చేయలేకపోయాడు. సెంచరీకి 25-30 పరుగుల దూరంలో ఆగిపోతున్నాడు. విరాట్ కోహ్లీ విషయంలోనూ ఇదే. విరాట్‌కి పిచ్ బాగుండాలి. అయితే త్వరలోనే అతను సెంచరీ చేస్తాడు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్..