- Home
- Sports
- Cricket
- 2011 వరల్డ్ కప్ ఆడి, 2023 ప్రపంచ కప్‌లోనూ ఆడబోతున్న 8 మంది... విరాట్ కోహ్లీతో పాటు..
2011 వరల్డ్ కప్ ఆడి, 2023 ప్రపంచ కప్‌లోనూ ఆడబోతున్న 8 మంది... విరాట్ కోహ్లీతో పాటు..
12 ఏళ్ల తర్వాత స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడబోతోంది టీమిండియా. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా హాట్ ఫెవరెట్. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు, అదే మ్యాజిక్‌ని రిపీట్ చేయాలనుకుంటోంది. 12 ఏళ్ల క్రితం జరిగిన ఆ వరల్డ్ కప్‌లో ఆడి, 2023 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఆడబోతున్నారు 8 మంది ప్లేయర్లు..

విరాట్ కోహ్లీ: 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్‌లో 35 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ సమయంలో 35 ఏళ్లకు చేరుకుంటాడు. కోహ్లీతో ఆడిన సచిన్ టెండూల్కర్, ధోనీ, యువరాజ్, గౌతమ్ గంభీర్ అందరూ రిటైర్ అయిపోయారు. పియూష్ చావ్లా రిటైర్మెంట్ ప్రకటించకపోయినా టీమిండియాకి ఆడి చాలా ఏళ్లే అవుతోంది... టీమిండియా తరుపున 2011 వన్డే వరల్డ్ కప్ ఆడి, 2023 వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్న ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ..
Steve Smith
స్టీవ్ స్మిత్: 2011 వన్డే వరల్డ్ కప్ ఆడిన ఆస్ట్రేలియా టీమ్‌లోని రికీ పాంటింగ్, షేన్ వాట్సన్, బ్రెట్ లీ అందరూ రిటైర్ అయిపోయారు. ఇండియాలో జరిగిన 2011 వన్డే వరల్డ్ కప్‌లో స్పిన్నర్‌గా ఆడిన స్టీవ్ స్మిత్, ఈసారి ఆస్ట్రేలియా టాపార్డర్ బ్యాటర్‌గా ఆడబోతున్నాడు..
Kane Williamson
కేన్ విలియంసన్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడిన కేన్ విలియంసన్, 2023 వరల్డ్ కప్ సమయానికి పూర్తిగా కోలుకుంటానని అంటున్నాడు. అదే జరిగితే 2019 వన్డే వరల్డ్ కప్‌లో కెప్టెన్సీ చేసి, 2023 వన్డే వరల్డ్ కప్‌లోనూ కెప్టెన్‌గా ఆడే ఏకైక సారథిగా నిలుస్తాడు కేన్ మామ..
టిమ్ సౌథీ: 2011 వన్డే వరల్డ్ కప్‌లో 18 వికెట్లు తీసిన టిమ్ సౌథీ, 2023 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఆడబోతున్నాడు. అయితే 34 ఏళ్ల టిమ్ సౌథీ, 2011 పర్ఫామెన్స్‌ని రిపీట్ చేయడం మాత్రం చాలా కష్టం..
Shakib Al Hasan
షకీల్ అల్ హసన్: 2007 వన్డే వరల్డ్ కప్ నుంచి క్రికెట్‌లో కొనసాగుతున్న అతి కొద్ది ప్లేయర్లలో షకీబ్ అల్ హసన్ ఒకడు. 36 ఏళ్ల షకీబ్ అల్ హసన్, 2011 వన్డే వరల్డ్ కప్‌లో 142 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీశాడు. 2023 వన్డే వరల్డ్ కప్, షకీబ్‌కి ఐదో ప్రపంచ కప్, ఇదే ఆఖరి వరల్డ్ కప్ కూడా కావచ్చు..
Mushfiqur Rahim-Shakib Al Hasan
ముస్ఫికర్ రహీం: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముస్ఫీకర్ రహీం, 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాడు. 2007 వన్డే వరల్డ్ కప్‌లో ఇండియాని ఓడించిన బంగ్లా టీమ్‌లో సభ్యులుగా షకీబ్ అల్ హసన్, ముస్ఫీకర్ రహీం, తమీమ్ ఇక్బాల్... 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడబోతున్నారు..
Wayne Parnell
వేన్ పార్నెల్: సౌతాఫ్రికా లెఫ్ట్ ఆర్మీ పేసర్ వేన్ పార్నెల్, 2011 వన్డే వరల్డ్ కప్ ఆడాడు. అయితే ఈ టోర్నీలో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన పార్నెల్, ఈసారి సౌతాఫ్రికా తరుపున వన్డే వరల్డ్ కప్ 2023 ఆడే అవకాశం దక్కొచ్చు. అయితే కగిసో రబాడా, లుంగి ఇంగిడి, ఆన్రీచ్ నోకియా, మార్కో జాన్సెన్ వంటి యంగ్ పేసర్ల మధ్య పార్నెల్‌కి చోటు దక్కుతుందా? లేదా? అనేది అనుమానమే..
అదిల్ రషీద్: 2011 వన్డే వరల్డ్ కప్ ఆడిన ఇంగ్లాండ్ టీమ్‌లో చోటు దక్కినా రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు అదిల్ రషీద్. అయితే ఈసారి ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌కి ప్రధాన స్పిన్నర్‌గా ఆడబోతున్నాడు రషీద్..