MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రోహిత్ శర్మ కొట్టేశాడు, విరాట్ కోహ్లీ సెలబ్రేట్ చేసుకున్నాడు... హిట్‌మ్యాన్ సెంచరీ తర్వాత...

రోహిత్ శర్మ కొట్టేశాడు, విరాట్ కోహ్లీ సెలబ్రేట్ చేసుకున్నాడు... హిట్‌మ్యాన్ సెంచరీ తర్వాత...

ఎన్నో ఏళ్లుగా తన కెరీర్‌లో లోటుగా మిగిలిన ఓవర్‌సీస్ సెంచరీని అందుకున్నాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ. టెస్టులకు పనికిరాడని, స్వదేశీ పిచ్‌లపై బాగా ఆడతాడని విమర్శలకు తన సెంచరీతోనే సమాధానం ఇచ్చాడు రోహిత్. ఇంగ్లాండ్‌లో వన్డే, టీ20, టెస్టుల్లో సెంచరీ చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ...  

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 04 2021, 08:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

వెస్టిండీస్‌‌పై 194 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీని అందుకున్న రోహిత్ శర్మ...  205 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో తన మొట్టమొదటి విదేశీ సెంచరీ అందుకున్నాడు. రోహిత్ శర్మకు టెస్టుల్లో ఇది 8వ సెంచరీ కాగా, టెస్టు కెరీర్‌లో రోహిత్‌కి ఇదే నెమ్మదైన సెంచరీ కావడం మరో విశేషం. 

212

ఇంగ్లాండ్‌లో ఓవరాల్‌గా రోహిత్ శర్మకి ఇది 9వ సెంచరీ. ఇంగ్లాండ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ప్లేయర్‌గా రాహుల్ ద్రావిడ్ 8 సెంచరీల రికార్డును అధిగమించాడు రోహిత్...

312

టెస్టుల్లో సిక్సర్‌తో సెంచరీ పూర్తిచేసుకోవడం రోహిత్ శర్మకు ఇది మూడో సారి. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 6 సార్లు సిక్సర్‌తో సెంచరీ అందుకుని టాప్‌లో ఉన్నాడు..

412

రోహిత్ శర్మ సెంచరీని డ్రెస్సింగ్ రూమ్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. రోహిత్ కంటే ఎక్కువగా తానే సెంచరీ చేసినట్టుగా పిడికిలి బిగించి సెలబ్రేట్ చేసుకున్నాడు కోహ్లీ...

512

ఈ టెస్టు సిరీస్‌కి ముందు తన కెరీర్‌లో విదేశాల్లో ఆడిన 39 ఇన్నింగ్స్‌ల్లో కేవలం నాలుగుసార్లు మాత్రమే 100కి పైగా బంతులు ఆడిన రోహిత్, ఈ సిరీస్‌లోనే ఐదుసార్లు ఈ ఫీట్ సాధించడం విశేషం...

612

2021 క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తిచేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్‌గానూ నిలిచాడు రోహిత్ శర్మ. ఈ ఏడాది జో రూట్, బాబర్ ఆజమ్, రిజ్వాన్ వెయ్యికి పైగా పరుగులు సాధించిన వారిలో ఉన్నారు...

712

ఓపెనర్‌గా 11 వేల పరుగులు అందుకున్న రోహిత్ శర్మ, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు..

812

సచిన్ టెండూల్కర్ 241 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా 11 వేల అంతర్జాతీయ పరుగులు అందుకుంటే, రోహిత్ శర్మ 246 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. అయితే సచిన్ కంటే రోహిత్ శర్మ యావరెట్ ఎక్కువ ఉండడం విశేషం...

912

11 వేల పరుగులను అందుకున్నప్పుడు సచిన్ టెండూల్కర్ సగటు 49.2 కాగా, రోహిత్ శర్మ 49.4 సగటుతో ఈ మైలురాయిని అందుకున్నాడు....

1012

ఈ టెస్టు సిరీస్‌లో మొత్తంగా 700+ పైగా బంతులను ఎదుర్కొన్నాడు రోహిత్ శర్మ. తన కెరీర్‌లోనే ఇది అత్యధికం. ఇంతకుముందు 2019లో భారత్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధికంగా 683 బంతులు ఆడాడు రోహిత్...

1112

ఇంగ్లాండ్‌లో 2 వేల పరుగులను పూర్తిచేసుకున్న రోహిత్ శర్మ, టెస్టుల్లో 3 వేల పరుగులు మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇంగ్లాండ్‌లో ద్రావిడ్, సచిన్, కోహ్లీ తర్వాత 2 వేల పరుగులు చేసిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ..

1212

ఇంగ్లాండ్‌లో ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 18వ సారి 50+ స్కోరు చేసిన రోహిత్ శర్మ... అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన ఓపెనర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Sanju : ధోనీ, హార్దిక్‌లకు సంజూ షాక్.. ఇది కదా మాస్ ఎంట్రీ అంటే !
Recommended image2
IPL 2026 : లక్ ఎంతో కాలం ఉండదు బాసూ ! వైభవ్ సూర్యవంశీకి మాస్ వార్నింగ్
Recommended image3
Mumbai Indians : రోహిత్ శర్మకు హార్దిక్ వార్నింగ్? ముంబై ఇండియన్స్ లో ఏం జరుగుతోంది బాసూ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved