డేంజర్‌లో విరాట్ కోహ్లీ ప్లేస్... ఇంకా ఒక్క మ్యాచ్‌లో ఆ ఇద్దరూ అదరగొడితే చాలు...
టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలో ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 5లో ఉన్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. వన్డేల్లో రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ, టీ20, టెస్టుల్లో ఐదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. అతని కోహ్లీ టెస్టు ర్యాంకు ప్రమాదంలో పడింది...

మొదటి రెండు టెస్టుల్లో అద్భుత సెంచరీలతో అదరగొట్టిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులతో అజేయంగా నిలిచిన జో రూట్ ఖాతాలో ప్రస్తుతం 893 పాయింట్లు ఉన్నాయి..
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ను వెనక్కినెట్టిన జో రూట్ రెండో ర్యాంకుకి ఎగబాకగా... టాప్‌లో ఉన్న కేన్ విలియంసన్ కంటే ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌కి కేవలం 8 పాయింట్లు తక్కువగా ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో మరో 30+ పరుగులు చేసి ఉంటే, విలియంసన్‌కి కూడా దాటేసేవాడే...
ప్రస్తుతం 776 పాయింట్లతో ఉన్న విరాట్ కోహ్లీ... ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తన ఐదో స్థానాన్ని కాపాడుకోగలిగాడు. అయితే ఆరో స్థానంలో ఉన్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్‌కి చాలా దగ్గరగా వచ్చేశాడు...
విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేయగా... రోహిత్ శర్మ 82 పరుగులతో అదరగొట్టాడు. దీంతో ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి. అంటే విరాట్ కంటే కేవలం 3 పాయింట్లు తక్కువ. మూడో టెస్టులో కోహ్లీ విఫలమైతే, అతని ప్లేస్‌లోకి రోహిత్ వచ్చేయడం ఖాయం...
అలాగే భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 736 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. గత మూడు టెస్టుల్లో 50+ మార్కు అందుకోలేకపోయిన రిషబ్ పంత్... మూడో టెస్టులో ఆ ఫీట్ సాధిస్తే... విరాట్‌కి మరింత చేరువయ్యే అవకాశం ఉంది...
లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 129 పరుగులతో రాణించి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన కెఎల్ రాహుల్, ఏకంగా 19 స్థానాలు ఎకబాకి, 37వ స్థానానికి చేరుకున్నాడు...
అలాగే లార్డ్స్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో నాలుగేసి వికెట్లు తీసిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్... 18 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి దూసుకొచ్చాడు... ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ కూడా ఐదు స్థానాలు పెరిగి 37వ ర్యాంకుకి చేరుకున్నాడు...
2019 డబ్ల్యూటీసీ ఆరంభంలో 922 పాయింట్లతో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉండగా, అప్పుడు రోహిత్ శర్మ ఖాతాలో ఉన్న పాయింట్లు 524 మాత్రమే. ఈ రెండేళ్లలో రోహిత్ 250 పాయింట్లను ఖాతాలో వేసుకుంటే, భారత సారథి విరాట్ కోహ్లీ వరుసగా ఫెయిల్ అవుతూ 150 పాయింట్లు పోగొట్టుకున్నాడు...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో హైయెస్ట్ ర్యాంకు సాధించిన ఓపెనర్ రోహిత్ శర్మ కాగా... అత్యుత్తమ ర్యాంకు సాధించిన వికెట్ కీపర్ రిషబ్ పంత్... అలాగే టాప్‌లో ఉన్న స్పిన్నర్ అశ్విన్...
వరుసగా రండు టెస్టులకు దూరమైన రవిచంద్రన్ అశ్విన్, టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 9లో జస్ప్రిత్ బుమ్రా, తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ తీయలేకపోవడంతో 10వ స్థానానికి పడిపోయాడు...
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా మూడో స్థానానికి పడిపోగా... రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో విండీస్ ప్లేయర్ జాసన్ హోల్డర్ టాప్‌లో ఉన్నారు...