వన్డే వరల్డ్ కప్ కోసం స్పెషల్ డైట్ ఫాలో అవుతున్న విరాట్ కోహ్లీ.. అందరూ చికెన్, ఫిష్, మటన్ తింటుంటే..
భారత క్రికెట్ జట్టులో మోస్ట్ ఫిట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో గాయాలతో విరాట్ కోహ్లీ తప్పుకున్న మ్యాచుల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. కెరీర్ ఆరంభంలో బటర్ చికెన్‌ని తెగ ఇష్టపడి, తిన్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు పూర్తి శాఖాహారిగా మారిపోయాడు..
అనుష్క శర్మను ప్రేమించి, పెళ్లాడిన తర్వాత విరాట్ కోహ్లీ డైట్ పూర్తిగా మారిపోయింది. పూర్తిగా వెజిటేరియన్‌గా మారిన విరాట్ కోహ్లీ, ఫిట్‌నెస్‌పైన మరింత శ్రద్ధ పెట్టాడు..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం విరాట్ కోహ్లీ స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నాడట. ఈ విషయాన్ని భారత క్రికెట్ జట్టు బస చేసిన హోటల్ లీలా ప్యాలెస్ ఛెఫ్ అన్షుమాన్ బాలీ బయటపెట్టాడు..
‘భారత క్రికెట్ జట్టు కోసం అన్ని రకాల మాంసాహారాలు మెనూలో ఉంటాయి. అయితే చాలా మంది ప్లేయర్లు స్టీమ్, గ్రిల్ చేసిన చికెన్ లేదా ఫిష్ తినడానికి ఇష్టపడతారు..
అయితే విరాట్ కోహ్లీ పూర్తిగా వెజిటేరియన్. అతను మాంసం తినడు. కాబట్టి పోషకాలు పుష్కలంగా ఉండే వెజిటేబుల్స్‌ని తీసుకుంటాడు.
సోయా, టోఫూ, మోక్ మీట్స్ (వెజిటేబుల్స్‌తో చేసిన మాంసం), ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటాడు. చాలా తక్కువ పరిమాణంలో డైరీ ప్రొడక్స్ తీసుకుంటాడు..
ఐపీఎల్ సమయంలో ప్లేయర్లు ఇక్కడికి వస్తుంటారు. వారికి ఏం కావాలో, ఏ ప్లేయర్ ఏమేం తింటాడో మాకు బాగా తెలుసు. న్యూజిలాండ్ ప్లేయర్లకు కారం ఉంటే కూరలు నచ్చవు.. అయితే డివాన్ కాన్వే వంటి ప్లేయర్లకు పరాఠాలు బాగా ఇష్టం..
మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ, కినోవా ఇడ్లీవి చాలా మంది ప్లేయర్లు ఎక్కువ ఇష్టపడతారు. భారత జట్టు ప్లేయర్లకు రాగి దోశ ఫెవరెట్ బ్రేక్ ఫాస్ట్... పార్టీ అయితే తప్ప అల్కహాల్ అస్సలు ఉండదు..’ అంటూ చెప్పుకొచ్చాడు ఛెఫ్ అన్షుమాన్ బాలీ..