నీ పక్కనుంటే ఇంట్లో ఉన్నట్టే... అనుష్క శర్మతో రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన విరాట్ కోహ్లీ...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత క్రికెట్‌కి బ్రేక్ తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుతం కుటుంబంతో కలిసి గడుపుతున్నాడు. ముంబై టెస్టు కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే, భార్య అనుష్కతో కలిసి ఏకాంతంగా విహరిస్తున్నాడు...
రాళ్లపై కూర్చొని నిశ్చలంగా ప్రవహిస్తున్న ఓ నదీ ప్రవాహాన్ని చూస్తూ, ప్రకృతి ఒడిలో ఏకాంతంగా భార్య అనుష్క శర్మతో కలిసి గడుపుతున్న క్షణాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు విరాట్ కోహ్లీ...
‘నువ్వు నా పక్కనుంటే, నేను ఎక్కడుంటే అది ఇళ్లులాగే అనిపిస్తుంది... మై లవ్... ’ అంటూ సతీమణి అనుష్క శర్మను ట్యాగ్ చేశాడు విరాట్ కోహ్లీ...
దీనికి అనుష్క శర్మ... ‘అది మంచిదే... ఎందుకంటే నువ్వు ఎప్పుడుంటావని...’ అంటూ రిప్లై ఇచ్చింది... ఈ ఇద్దరూ తలలు కనిపించుకుండా వెనక నుంచి తీసిన ఫోటోను షేర్ చేశాడు విరాట్...
2017 డిసెంబర్‌లో విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క శర్మ... పెళ్లైన తర్వాత ఏడాదిలో కేవలం 22 రోజుల పాటు మాత్రమే కలిసి ఉన్నామంటూ ప్రకటించింది...
విరాట్ కోహ్లీ బిజీ షెడ్యూల్ కారణంగా వివిధ దేశాలు తిరుగుతూ ఉంటే, పెళ్లైన తర్వాత కూడా సినిమాల్లో హీరోయిన్‌గా కొనసాగిన అనుష్క శర్మ పొజిషన్ కూడా దాదాపు అదే...
ఎట్టకేలకు 2020 లాక్‌డౌన్ కారణంగా తమ ఇద్దరూ ఏకాంతంగా గడిపేందుకు కావాల్సినంత సమయం దొరికిందని, కరోనా మా ఇద్దరికీ మంచే చేసిందని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అనుష్క శర్మ...
కరోనా లాక్‌డౌన్‌లో అనుష్క శర్మ గర్భం దాల్చినట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ, లాక్‌డౌన్ తర్వాత భార్యతో కలిసి ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈ చేరుకున్నాడు...
అక్కడి నుంచి విరాట్ కోహ్లీ నేరుగా ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లగా అనుష్క శర్మ ప్రసవం కోసం స్వదేశానికి తిరిగి వచ్చింది.
ఆడిలైడ్ టెస్టు ముగిసిన తర్వాత పెటర్నరీ లీవ్ ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ ఇద్దరికీ 2021 జనవరిలో ఆడబిడ్డ (వామిక కోహ్లీ) జన్మించిన విషయం తెలిసిందే..
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు...
కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టుకి కూడా దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, ముంబై వేదికగా జరిగే రెండో టెస్టు కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు..