- Home
- Sports
- Cricket
- ప్రస్తుతతరంలో కోహ్లీ ఒక్కడికే సాధ్యం! ఒకే దెబ్బతో రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీలను వెనక్కి నెట్టి...
ప్రస్తుతతరంలో కోహ్లీ ఒక్కడికే సాధ్యం! ఒకే దెబ్బతో రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీలను వెనక్కి నెట్టి...
విరాట్ కోహ్లీని ముద్దుగా రన్ మెషిన్ అని పిలుస్తారు. దశాబ్దానికి పైగా క్రికెట్ ప్రపంచం షాక్ అయ్యే రీతిలో పరుగులు చేస్తూ వచ్చినఈ మెషిన్, లాక్‌డౌన్‌లో కాస్త రిపేర్ అయ్యింది. గత మూడేళ్లుగా విరాట్ కోహ్లీ నుంచి ఆశించిన రేంజ్‌లో పరుగులు రాలేదు, మెషిన్ స్లో అయ్యింది. అయితే రికార్డులు మాత్రం ఎక్కడా ఆగలేదు. డొమినికా టెస్టులో 76 పరుగులు చేసి అవుటైన విరాట్ ఖాతాలో కొన్ని రికార్డులు చేరాయి.

Image credit: PTI
విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఇది మూడో స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ. 2012లో నాగ్‌పూర్‌లో 171 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, 2022 కేప్‌టౌన్ టెస్టులో 159 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. నేటి మ్యాచ్‌లో 147 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..
విదేశాల్లో విరాట్ కోహ్లీకి ఇది 88వ 50+ స్కోరు. టీమిండియా తరుపున విదేశాల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు బాదిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ 96 సార్లు ఈ ఫీట్ సాధిస్తే, రాహుల్ ద్రావిడ్ (87 సార్లు)ని వెనక్కి నెట్టి, రెండో స్థానానికి ఎగబాకాడు విరాట్ కోహ్లీ..
Image credit: PTI
టెస్టుల్లో విదేశాల్లో విరాట్ కోహ్లీకి ఇది 31వ 50+ స్కోరు. సచిన్ టెండూల్కర్ 65 సార్లు, విదేశాల్లో టెస్టుల్లో 50+ స్కోర్లు చేసి టాప్‌లో ఉంటే రాహుల్ ద్రావిడ్ 57, వీవీఎస్ లక్ష్మణ్ 41, సునీల్ గవాస్కర్ 40 సార్లు ఈ ఫీట్ సాధించారు. సౌరవ్ గంగూలీ 30 సార్లు విదేశాల్లో 50+ స్కోర్లు చేసి, కోహ్లీ తర్వాతి ప్లేస్‌లో ఉన్నాడు..
Image credit: PTI
టీమిండియా తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ 15,921 టెస్టు పరుగులతో టాప్‌లో ఉంటే, రాహుల్ ద్రావిడ్ 13,265, సునీల్ గవాస్కర్ 10,112 పరుగులు చేశారు. వీవీఎస్ లక్ష్మణ్ 8781 పరుగులతో టాప్ 4లో ఉంటే, విరాట్ కోహ్లీ 8500+ పరుగులు చేసి టాప్ 5లో ఉన్నాడు..
Image credit: PTI
ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో విరాట్ కోహ్లీకి ఇది 206వ 50+ స్కోరు. సచిన్ టెండూల్కర్ 264 సార్లు ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉంటే, రికీ పాంటింగ్ 217, కుమార సంగర్కర 216, జాక్వలిస్ కలీస్ 211 సార్లు 50+ స్కోర్లు సాధించి... విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు.. ప్రస్తుత తరంలో 200లకు పైగా 50+ స్కోర్లు చేసిన ఏకైక బ్యాటర్‌గా ఉన్నాడు కోహ్లీ..