విరాట్, రోహిత్ టీ20లు ఆడాలి! టీ20 వరల్డ్ కప్ 2024లో ఉండాలి.. - సౌరవ్ గంగూలీ..
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత టీ20 టీమ్‌కి దూరంగా ఉంటున్నారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీరితో పాటు కెఎల్ రాహుల్ కూడా అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడి చాలా నెలలు దాటింది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని దృష్టిలో పెట్టుకుని వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి కూడా రోహిత్, విరాట్ కోహ్లీలను సెలక్ట్ చేయలేదు బీసీసీఐ..
టీ20 ఫార్మాట్‌కి ఉండాలని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకోలేదు. అయితే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ ఇద్దరినీ పొట్టి ఫార్మాట్ నుంచి పక్కనబెట్టేసింది బీసీసీఐ. టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత ఒక్క టీ20 సిరీస్‌లో కూడా వీళ్లు ఆడలేదు..
Image credit: Getty
ఐపీఎల్ 2023 సీజన్‌లో రోహిత్ శర్మ బ్యాటర్‌గా ఫెయిల్ అయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో ఐపీఎల్ 2023 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ 4లో నిలిచాడు. అయితే అతన్ని తిరిగి టీ20లకు ఎంపిక చేసేందుకు సెలక్టర్లు ఆసక్తి చూపించలేదు..
Virat Kohli-Rohit Sharma
‘ప్లేయర్ల వయసుతో సంబంధం లేకుండా ఎంపిక జరగాలి. నా ఉద్దేశంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఇంకా టీ20 క్రికెట్ ఆడగలరు. అయితే ఎందుకని ఈ ఇద్దరినీ టీ20 ఫార్మాట్‌కి దూరంగా పెట్టారో నాకైతే అర్థం కావడం లేదు..
Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌లో విరాట్ కోహ్లీ బాగా ఆడాడు. రోహిత్ శర్మ కూడా టీమ్‌కి కీ ప్లేయర్లు. నన్ను అడిగితే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఆడాలి..
Virat Kohli-Rohit Sharma
ఐపీఎల్‌లో బాగా ఆడిన కొందరు కుర్రాళ్లకు వెస్టిండీస్ టూర్‌లో చోటు దక్కలేదు. అయితే ఇది ఒక్క సిరీస్ మాత్రమే కాబట్టి దీని గురించే ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకోవద్దు. నిలకడగా ఆడుతూనే ఉండండి. అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపించుకూనే ఉండాలి..
Rinku Singh
బాగా ఆడిన అందరికీ టీమ్‌కి ఆడించడం చాలా కష్టం. ఎందుకంటే ఏ సిరీస్‌కైనా 15 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. అందులోనూ 11 మంది మాత్రమే ఆడతారు. కాబట్టి కొందరికి అవకాశం దక్కొచ్చు, కొందరికి తర్వాత పిలుపు రావచ్చు. అవకాశం వచ్చే దాకా ప్రయత్నిస్తూనే ఉండడం ముఖ్యం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..