నెల రోజుల తర్వాత వెస్టిండీస్ సిరీస్! రెండు మ్యాచులకే మళ్లీ రెస్ట్... వన్డే వరల్డ్ కప్ 2023 ముందు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత నెల రోజులు రెస్ట్ తీసుకుంది టీమిండియా. బిజీ షెడ్యూల్‌ని దృష్టిలో పెట్టుకుని క్రికెటర్లకు హాలీడేస్ ఇచ్చింది బీసీసీఐ... క్రికెటర్లు అందరూ ఫ్యామిలీస్‌తో వెకేషన్స్‌లో గడిపి వెస్టిండీస్‌లో అడుగుపెట్టారు..
నెల రోజుల బ్రేక్ తర్వాత వెస్టిండీస్ టూర్‌కి వెళ్లిన భారత జట్టు, రెండు టెస్టులు ఆడింది. తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసిపోగా వర్షం కారణంగా రెండో టెస్టులో ఐదో రోజు ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు అయ్యింది..
వెస్టిండీస్ పేలవ బ్యాటింగ్ కారణంగా తొలి వన్డేలో భారత బ్యాటర్లకు ఆశించినంత ప్రాక్టీస్ దక్కలేదు. చేయాల్సిన లక్ష్యం 115 పరుగులే ఉండడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసిన భారత జట్టు, తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది..
5 వికెట్లు పడడంతో రోహిత్ శర్మ, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి రాగా... విరాట్ కోహ్లీ అస్సలు బ్యాటింగ్‌కే రాలేదు. అయినా రెండో వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు రెస్ట్ ఇవ్వడంపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...
Kohli-Rohit
విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో 49, తొలి టెస్టులో 76, రెండో టెస్టులో 121 పరుగులు చేశాడు. అలాంటి బ్యాటర్‌ని వరల్డ్ కప్ ముందు ఎన్ని మ్యాచులు ఆడిస్తే టీమ్‌కి అంత మంచిది..
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఫ్లాప్ అయిన రోహిత్ శర్మ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... తొలి టెస్టులో సెంచరీ చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేసిన రోహిత్, రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు..
Image credit: Getty
వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా ఆడేదే 3 వన్డేలు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్, ఐర్లాండ్ టూర్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడడం లేదు. అయినా రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతి ఇవ్వడానికి కారణం ఏంటో క్రికెట్ ఫ్యాన్స్‌కి అర్థం కావడం లేదు..
Image credit: PTI
వన్డే సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సెప్టెంబర్‌లో ఆసియా కప్ 2023 టోర్నీలోనే ఆడబోతున్నారు. అంటే మరో నెల రోజులకు పైగా రెస్ట్ దక్కనుంది. ఇలాంటి సమయంలో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లోనూ ఈ ఇద్దరినీ ఆడించాల్సింది పోయి, ప్రయోగాలు, రెస్ట్ పేరుతో తప్పించడం వెనక లాజిక్ ఏముందో అర్థం కావడం లేదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..