- Home
- Sports
- Cricket
- మటన్ రోల్స్ కోసం ప్రాణాలనే రిస్క్ చేశాడు... విరాట్ కోహ్లీ స్నేహితుడు ప్రదీప్ సాంగ్వాన్ కామెంట్...
మటన్ రోల్స్ కోసం ప్రాణాలనే రిస్క్ చేశాడు... విరాట్ కోహ్లీ స్నేహితుడు ప్రదీప్ సాంగ్వాన్ కామెంట్...
విరాట్ కోహ్లీ... వరల్డ్ బెస్ట్ క్రికెటర్ మాత్రమే కాదు, ఫిట్‌నెస్ ఫ్రీక్ కూడా. టీమిండియా ఫిట్‌నెస్ లెవెల్ స్టాండర్డ్స్‌ని మార్చేసిన విరాట్ కోహ్లీ, డైట్ విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. అయితే టీనేజ్ వయసులో విరాట్ చేసిన ఓ చిలిపి పనిని బయటపెట్టాడు అతని స్నేహితుడు ప్రదీప్ సాంగ్వాన్..

అండర్ 19 వరల్డ్ కప్ 2008 టోర్నీలో ఆడిన జట్టులో సభ్యుడైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ప్రదీప్ సాంగ్వాన్, ఐపీఎల్ 2008లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడాడు...
తన సొంత జట్టు అయిన ఢిల్లీ తరుపున ఆడాలని విరాట్ భావించినా, ఆ టీమ్ మేనేజ్‌మెంట్ ప్రదీప్ సాంగ్వాన్‌ని తీసుకోవడానికి ఆసక్తి చూపించడంతో కోహ్లీ, ఆర్‌సీబీలోకి వచ్చాడు...
ఇప్పుడు పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయినప్పటికీ టీనేజ్‌లో మాంసాహారం.. అందులోనూ స్ట్రీట్ ఫుడ్ అంటే తెగ ఇష్టపడేవాడట విరాట్ కోహ్లీ...
‘జూనియర్ క్రికెట్ ఆడే సమయంలో విరాట్ కోహ్లీ, నాకు రూమ్‌మేట్. మేం 7-8 ఏళ్ల పాటు ఒకే రూమ్‌లో కలిసి ఉన్నాం. అతనికి ఫుడ్ అంటే బాగా ఇష్టం...
అందులోనూ స్ట్రీట్ ఫుడ్ తినడాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడు. విరాట్‌కి కుర్మా రోల్స్, చికెన్ రోల్స్ చాలా ఫేవరెట్...
అండర్ 19 వరల్డ్ కప్ ఆడేందుకు మేం సౌతాఫ్రికా వెళ్లాం. అప్పుడు మాకు ఎవరో ఓ ప్లేస్‌లో మంచి మటన్ రోల్స్ దొరుకుతాయని చెప్పారు...
అయితే ఆ ప్లేస్ మేం ఉన్న చోటుకి దగ్గర కాదు. మా డ్రైవర్ కూడా అక్కడ ఫుడ్ బాగుంటుంది కానీ, ఇప్పుడు అక్కడ పరిస్థితి బాలేదు. గొడవలు జరుగుతున్నాయి. ఎవరో ఒకతని చేయి నరికేశాడు అని చెప్పాడు...
నేను డ్రైవర్ చెప్పింది విని భయపడ్డాను. అయితే ఏం కాదులే... పోదాం పదా... అని విరాట్ కోహ్లీ నన్ను తనతో తీసుకెళ్లాడు...
మేం తిన్న తర్వాత కొందరు మనుషులు మమ్మల్ని ఫాలో అవ్వడం మొదలెట్టారు. మేం వెంటనే కారు ఎక్కి, వెనక సీట్లో దాక్కున్నాం... హోటల్‌కి వెళ్లాకే లేచాం...’ అంటూ 14 ఏళ్ల కిందట జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు ప్రదీప్ సాంగ్వాన్...
‘2012లో విరాట్ ఫిట్‌నెస్‌ని సీరియస్‌గా తీసుకున్నాడు. తనకి ఇష్టమైన ఫుడ్‌ని తినడం మానేసి, సీరియస్ డైట్ ఫాలో అవ్వడం మొదలెట్టాడు...
విరాట్ పట్టుదలని చూసి నాకు ఆశ్చర్యమేసింది. విరాట్ కోహ్లీ కొన్ని నెలల్లోనే కొన్ని కిలోల బరువు తగ్గాడు. బెస్ట్ ఫీల్డర్‌గా ఉండాలని, నెట్స్‌లో గంటల పాటు ప్రాక్టీస్ చేయాలని అంకితభావం విరాట్‌ని అలా మార్చేసింది..’ అంటూ కామెంట్ చేశాడు ప్రదీప్ సాంగ్వాన్...