- Home
- Sports
- Cricket
- కోహ్లీ మామూలోడు కాదు! ఫస్ట్ టైం కలిసినప్పుడే అనుష్కని అంత మాట అనేశాడా.. విరుష్క లవ్ స్టోరీ సీక్రెట్స్...
కోహ్లీ మామూలోడు కాదు! ఫస్ట్ టైం కలిసినప్పుడే అనుష్కని అంత మాట అనేశాడా.. విరుష్క లవ్ స్టోరీ సీక్రెట్స్...
అండర్19 వరల్డ్ కప్ గెలిచి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, అతి కొద్ది కాలంలోనే టీమిండియాకి స్టార్ బ్యాటర్ అయిపోయాడు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో అత్యధిక విజయాల శాతం నమోదు చేసిన కెప్టెన్‌గానూ నిలిచాడు. విరాట్ కోహ్లీ సక్సెస్‌లో ఆమె భార్య అనుష్క శర్మకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే...

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లాడిన విరాట్ కోహ్లీ, మొదటి ఏడాదిలో కేవలం 21 రోజులు మాత్రమే భార్యతో కలిసి ఉన్నాడట. అటు అనుష్క వరుస సినిమాలతో, ఇటు విరాట్ కోహ్లీ క్రికెట్ టోర్నీలతో బిజీ బిజీగా గడిపేశారు. ఎట్టకేలకు కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ ఇద్దరూ ఏకాంతంగా గడపడానికి చాలా సమయం దొరికినట్టైంది...
Image: Google
2017లో అనుష్క శర్మను పెళ్లాడిన విరాట్ కోహ్లీ, 2021లో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. కూతురు వామిక కోహ్లిని మీడియాకి దూరంగా పెంచాలని నిర్ణయం తీసుకున్న విరుష్క జోడి... అసలు ప్రేమలో ఎలా పడ్డారు? వీళ్లిద్దరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది. తాజాగా ఏబీ డివిల్లియర్స్‌తో జరిగిన ఆన్‌లైన్ సెషన్‌లో ఈ విషయాన్ని బయటపెట్టాడు విరాట్ కోహ్లీ...
Anushka Sharma,Virat Kohli
‘2013లో నేను మొదటిసారి అనుష్కని కలిశా. ఓ యాడ్ షూట్ కోసం ఆమెతో పనిచేయబోతున్నా అని తెలిశాక చాలా టెన్షన్ పడ్డాను. ఆమె అప్పటికే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. తనతో ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అని చాలా ఆలోచించా...
షూటింగ్ లొకేషన్‌కి అనుష్క కంటే 5 నిమిషాల ముందే నేను వెళ్లాను. ఆమె ఎంత పొడుగు ఉంటుందో నాకు తెలీదు. తన హీల్స్ చాలా పెద్దగా ఉన్నాయి. వాటి వల్ల నేను తన ముందు మరుగుజ్జలా కనిపిస్తానని అనిపించింది...
వెంటనే ఎలాంటి మొహామాటం లేకుండా ‘ఇంతకంటే పొడుగ్గా ఏదీ దొరకలేదా వేసుకోవడానికి’ అనేశా.. ఆమె నా మాటలకు షాక్ అయిపోయి ‘ఏంటి?’ అని ఆశ్చర్యంగా అడిగింది. నాకు ఇబ్బందిగా అనిపించి, అక్కడి నుంచి పక్కకు వెళ్లా...
ఆ రోజు మొత్తం ఆమెతో షూటింగ్ చేసిన తర్వాత తను చాలా నార్మల్ వ్యక్తి అని తెలుసుకున్నా. తను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది. నాది కూడా మిడిల్ క్లాసే కావడంతో ఆ విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నాం. తనతో ఈజీగా కనెక్ట్ అయిపోయా...
ఆ తర్వాత ఫ్రెండ్స్‌గా మారాం, కొన్నాళ్లకు డేటింగ్ చేయడం మొదలెట్టాం. ఫ్రెండ్స్ అవ్వగానే డేటింగ్ చేయాలనే ఆలోచన రాలేదు. చాలాకాలం పాటు మాట్లాడుకున్నాం. తనకు నేను బాగా అలవాటు పడిపోయా.. మేం డేటింగ్‌లో ఉన్నామనే ఫీలింగ్ నాలో వచ్చేసింది...
కలిసి బయటికి వెళ్లేవాళ్లం, డిన్నర్‌కి, షాపింగ్‌కి వెళ్లేవాళ్లం.. ఓ రోజు.. ‘నేను సింగిల్‌గా ఉన్నప్పుడు అలా చేసేవాడిని.. ఇలా చేసేవాడిని..’ అని తనకి మెసేజ్ చేశా. తను ఆశ్చర్యపోయి.. ‘ఉన్నప్పుడు అంటే ఏంటి?’ అని అడిగింది...
నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా. నీతో నేను డేటింగ్‌లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నా... అని మెసేజ్ చేశా. ఆ తర్వాత కొన్నిరోజులకు తను నేను చాలా మంచోడేనని గుర్తించి, డేటింగ్‌కి ఒప్పుకుంది.. మూడేళ్లకు పెళ్లి చేసుకున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ...