Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ కు కారణం ఇదేనా?
Why did Virat Kohli retire from Test cricket: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. ఇప్పుడే విరాట్ కోహ్లీ ఎందుకు టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు?

Why did Virat Kohli retire from Test cricket: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. ఇంతకు ముందే ఆయన తన రిటైర్మెంట్ విషయం బీసీసీఐకి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అన్ని ప్రయత్నాలు చేసినా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నాయి.
రిటైర్మెంట్ పై విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో, ''టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం. #269 సైనింగ్ ఆఫ్'' అని పేర్కొన్నాడు. అయితే, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి 3 కారణాలున్నాయని క్రికెట్ సర్కిల్ టాక్ నడుస్తోంది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌కు కారణం చెప్పకపోయినా, ఈ నిర్ణయం వెనుక కొన్ని కారణాలు ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కోహ్లీ శారీరక ఒత్తిడి
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌కు ఒక కారణం టెస్ట్ ఫార్మాట్‌లో అవసరమైన ఫిట్‌నెస్ కావచ్చు. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఒక పాత ఇంటర్వ్యూలో, విరాట్ ఈ ఫార్మాట్ ఎంత కఠినమైనదో, వరుసగా 5 రోజులు ఆడటం వల్ల ఆటగాడిపై శారీరకంగా, మానసికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పాడు. కోహ్లీ మంచి ఫిట్‌నెస్ కలిగి ఉన్నాడు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం దృష్ట్యా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని చెబుతున్నారు.
టెస్ట్ మ్యాచ్‌లలో కోహ్లీ బ్యాటింగ్
గత ఐదేళ్లలో, విరాట్ కోహ్లీ టీ20, వన్డే క్రికెట్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ టెస్ట్ మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆయన బ్యాటింగ్‌లో స్థిరత్వం లేదు. గత ఐదేళ్లలో విరాట్ కోహ్లీ టెస్ట్ సగటు 50 కంటే తక్కువగా ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ బ్యాటింగ్ తడబాటు స్పష్టంగా కనిపించింది.
బీసీసీఐ ఒత్తిడి
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ఘోర పరాజయం తర్వాత బీసీసీఐ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇద్దరూ దేశవాళీ టోర్నీలలో తప్పనిసరిగా ఆడాలని ఆదేశించింది. అంతేకాకుండా, విదేశీ టోర్నీలకు కుటుంబ సభ్యులను తీసుకురావద్దని కూడా ఆటగాళ్లకు ఆదేశించింది. బీసీసీఐ ఒత్తిడి కోహ్లీని మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేసింది. బీసీసీఐ తనపై విమర్శలు చేయడం, ఒత్తిడి తేవడం కోహ్లీకి ఇష్టం లేదు. దీన్ని గ్రహించే ఆయన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.