- Home
- Sports
- Cricket
- యువీ పా.. మీకు ధన్యవాదాలు.. మీరు ఎప్పటికీ ఒకేలా ఉన్నారు : యువరాజ్ గిఫ్ట్ కు ఉబ్బితబ్బిబ్బవుతున్న కోహ్లి
యువీ పా.. మీకు ధన్యవాదాలు.. మీరు ఎప్పటికీ ఒకేలా ఉన్నారు : యువరాజ్ గిఫ్ట్ కు ఉబ్బితబ్బిబ్బవుతున్న కోహ్లి
Virat Kohli Overwhelmed Yuvraj Singh Gift: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ విలువైన బహుమతి పంపిన విషయం తెలిసిందే. గిఫ్ట్ ను అందుకున్న కోహ్లి సోషల్ మీడియాలో...

తనకు యువరాజ్ సింగ్ పంపిన బహుమతి పట్ల విరాట్ కోహ్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. యువీ తన పట్ల చూపిన అభిమానానికి కోహ్లి మురిసిపోతున్నాడు.
పుమా బ్రాండ్ కు చెందిన గోల్డెన్ బూట్స్ ను పంపుతూ.. ‘‘విరాట్, నువ్వు క్రికెటర్‌గా, వ్యక్తిగా ఎదగడాన్ని నేను చూస్తూ వచ్చాను. నెట్స్‌లో కుర్రాడిగా ఉన్నప్పటి నుంచి క్రికెట్ లెజెండ్‌గా ఎదిగివరకూ నీతో కలిసి నడిచాను. కొత్త తరాన్ని నడిపించడంలో నువ్వు నిజమైన లెజెండ్‌వి.
నీ క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావం, అన్నింటికీ మించి క్రికెట్‌పై నీకున్న డెడికెషన్... దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరినీ స్ఫూర్తిదాయకంగా నిలిచాయి...
కెప్టెన్ గా, ప్లేయర్ గా నువ్వు ఎంతో సాధించావ్.. నీ కెరీర్ లో కొత్త ఛాప్టర్ లో ఎలాంటి ముద్ర వేస్తావోనని చూడటానికి ఆసక్తిగా చూస్తున్నా.. ప్రపంచానికి నువ్వు కింగ్ కోహ్లి వి కావచ్చు గానీ నాకు మాత్రం ఎప్పటికీ చీకూవే..’ అని రాసుకొచ్చాడు.
ఈ బహుమతి అందుకున్నాక కోహ్లి కూడా స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన కోహ్లి స్పందిస్తూ... ‘నా పట్ల ఇంతటి ఆదరణ చూపిన యువీ పా.. మీకు ధన్యవాదాలు. నా కెరీర్ మొదలైన తొలి రోజు నుంచి మిమ్మల్ని చూస్తున్నా..
క్యాన్సర్ నుంచి కోలుకున్న ముందుకు సాగుతున్న మీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. మీ చుట్టూ ఉన్న మనుషుల పట్ల ఎంతటి దయ, ఆదరాభిమానాలు కలిగి ఉంటారో నాకు తెలుసు. మీరు ఎప్పటికీ ఒకేలా ఉన్నారు.
ఇప్పుడు మనం తండ్రులయ్యాం. ఈ ప్రయాణంలో మీకు దేవుడి ఆశీస్సులు అందాలని.. సంతోషంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా...’ అని రాసుకొచ్చాడు.
ఈ ఇద్దరు క్రికెటర్లు టీమిండియాకు కలిసి ఆడారు. 2011 వన్డే ప్రపంచకప్ లో భారత జట్టు లో కోహ్లి, యువీ సభ్యులు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. కోహ్లిని తమ్ముడిలా భావించే యువీ తో అతడికి మంచి అనుభవం ఉంది.