- Home
- Sports
- Cricket
- అక్కడ విరాట్ కోహ్లీ, ఇక్కడ రోహిత్ శర్మ... శ్రీలంకతో 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన జట్టులో...
అక్కడ విరాట్ కోహ్లీ, ఇక్కడ రోహిత్ శర్మ... శ్రీలంకతో 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన జట్టులో...
సంచలనంలా టీమిండియాలోకి ఎంట్రీ, వివాదాలతో కెరీర్‌ను నాశనం చేసుకుని... ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన 11 ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు భారత సీమ్ బౌలర్ శ్రీశాంత్. శ్రీశాంత్ రిటైర్మెంట్‌తో 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడిన శకానికి దాదాపు తెరపడినట్టైంది...

2011 ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన జట్టులో ఒకే ఒక్క ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రమే మిగిలాడు...
ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఫైనల్ ఆడకపోయినా 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి కూడా చోటు దక్కింది...
విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ మినహా 2011 వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన భారత బృందంలోని ప్లేయర్లు అందరూ రిటైర్మెంట్ ప్రకటించేశారు...
2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్‌తో పాటు విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు...
వీరిలో ఆరేళ్ల పాటు టీమిండియాలో చోటు కోసం ఎదురుచూసిన హర్భజన్ సింగ్, ఈ ఏడాది ఆరంభంలో రిటైర్మెంట్ ప్రకటించగా, తాజాగా శ్రీశాంత్ కూడా భజ్జీని ఫాలో అయ్యాడు...
ఫైనల్ ఆడకపోయినా 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఎంపికైన ఆశీష్ నెహ్రా, యూసఫ్ పఠాన్ కూడా ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా, రవిచంద్రన్ అశ్విన్ కూడా విరాట్‌తో పాటు క్రికెట్‌లో కొనసాగుతున్న ప్లేయర్‌గా ఉన్నాడు...
దాదాపు పదేళ్ల క్రితం భారత జట్టుకి మ్యాచ్ ఆడిన స్పిన్నర్ పియూష్ చావ్లా, 2011 వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు...
అంతకుముందు 2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్‌లో పాక్‌ని ఓడించి టైటిల్ గెలిచిన జట్టులో కూడా ఇద్దరు ప్లేయర్లే మిగిలారు. మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ, ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే...
గౌతమ్ గంభీర్, యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, శ్రీశాంత్, ఆర్‌పీ సింగ్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా రోహిత్ శర్మతో పాటు రాబిన్ ఊతప్ప ఇంకా క్రికెట్‌లో కొనసాగుతున్నారు...
టీ20 వరల్డ్ కప్ 2007 ఫైనల్ ఆడకపోయినా టోర్నీకి ఎంపికైన అజిత్ అగార్క్కర్ రిటైర్మెంట్ ప్రకటించగా, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, పియూష్ చావ్లా... టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నవారిలో ఉన్నారు...