విరాట్‌కి ఆ అవసరం ఉంది, అందుకే అది నేను తీసుకున్నా... - రవిచంద్రన్ అశ్విన్...
మూడున్నరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లో సెంచరీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో 186 పరుగులు చేసి, సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...

Image credit: PTI
241 బంతుల్లో 5 ఫోర్లతో టెస్టుల్లో 28వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, 364 బంతుల్లో 15 ఫోర్లతో 186 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా అహ్మదాబాద్ టెస్టు డ్రాగా ముగిసింది...
Virat Kohli and R Ashwin
‘ఇండోర్ టెస్టు ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, నేను సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి డిస్కర్షన్ మా మధ్య జరగలేదు. అయితే నాకు పర్సనల్‌గా అనిపించింది ఏంటంటే విరాట్ కోహ్లీ బాగా ఆడుతున్నాడు కానీ భారీ స్కోరు చేయలేకపోతున్నాడు...
ఢిల్లీ టెస్టుల్లో చేసిన 40 ప్లస్ స్కోరు చాలా విలువైనది. ఎవ్వరైనా సరే, మన భుజాలపైన చెయ్యి వేసి, ‘నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. ఇంకొంచెం సేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించు. చాలా పెద్ద స్కోరు వస్తుంది...’ అని చెబితే, ఆ మాటలు చాలా పెద్ద బూస్టర్‌గా పనికి వస్తాయి...
kohli ashwin
నా విషయంలో చాలాసార్లు ఇలా జరిగింది. నా క్రికెట్ కెరీర్‌నే మార్చేసింది. ఈ సారి విరాట్ కోహ్లీ విషయంలో నేను ఆ బాధ్యత తీసుకున్నా. కోహ్లీ త్వరలోనే భారీ స్కోరు చేస్తాడని ముందుగానే అనుకున్నా.. ఎందుకంటే అంతకుముందు వన్డే సిరీస్‌లో కూడా విరాట్ కోహ్లీ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు...
Kohli-Ashwin
విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా వంటి సీనియర్లు బాగా ఆడితే మా బ్యాటింగ్ తిప్పలన్నీ తీరినట్టే. ఎందుకంటే ఒకరు జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్లను విసిగిస్తే, మరొకరు షాట్స్ ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించగలరు...
ఓ క్రికెటర్‌గా, ఈ ఇద్దరు దిగ్గజాలతో ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నందుకు గర్వపడుతున్నా. విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా ఆడుతుంటే నేను రోహిత్ శర్మ పక్కన కూర్చొని రోజంతా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. మేం అనుకున్నట్టే ఈ ఇద్దరూ అదరగొట్టారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో రవీంద్ర జడేజా 22 వికెట్లు తీయడంతో పాటు 135 పరుగులు చేయగా రవిచంద్రన్ అశ్విన్ 25 వికెట్లు తీసి, 86 పరుగులు చేశాడు... ఈ ఇద్దరూ సంయుక్తంగా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నారు..