- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, రోహిత్ శర్మలకు Goat ఐకాన్... రోహిత్‌ను ట్రోల్ చేస్తూ...
విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, రోహిత్ శర్మలకు Goat ఐకాన్... రోహిత్‌ను ట్రోల్ చేస్తూ...
భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, రోహిత్ శర్మలకు Goat ఐకాన్ ఇచ్చి గౌరవించింది సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్. అయితే ఇది కూడా మరోసారి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేగడానికి కారణమైంది...

భారత క్రికెట్‌తో వరల్డ్ క్రికెట్‌లోనే తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకున్న భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, రోహిత్ శర్మల హ్యాష్‌ట్యాగ్స్‌కి గోట్ (G.O.A.T- Great Of All Time) ఐకాన్ ఇచ్చింది ట్విట్టర్...
అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టైటిల్ గెలిచి, టెన్నిస్ వరల్డ్‌లో 21 గ్రాండ్ స్లామ్స్‌తో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన స్పెయిన్ బుల్, రఫెల్ నాదల్ హ్యాష్‌ట్యాగ్‌కి కూడా గోట్ ఐకాన్ చేర్చింది...
అయితే విరాట్ కోహ్లీకి గోట్ ఐకాన్ వచ్చిన తర్వాత రోహిత్ శర్మను ‘Pig’ (పంది) ఐకాన్‌ను చేర్చి, బీభత్సంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు భారత మాజీ కెప్టెన్ అభిమానులు...
కోహ్లీ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, రోహిత్ శర్మ ఆ బాధ్యతలను స్వీకరించడంతో సహజంగానే ‘హిట్ మ్యాన్’పై పీకల్లోతు కోపంతో రగిలిపోతున్నారు విరాట్ ఫ్యాన్స్...
కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యూజిలాండ్, వెస్టిండీస్‌లను క్లీన్ స్వీప్ చేసి... వరుసగా 9 విజయాలు అందుకున్నాడు రోహిత్ శర్మ...
అయితే భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనూ భారత జట్టు ద్వైపాక్షిక సిరీసుల్లో తిరుగులేని విజయాలు అందుకుంది... కానీ ఐసీసీ టోర్నీల్లో మాత్రం సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయింది...
ఇప్పుడు రోహిత్ శర్మ ద్వైపాక్షిక సిరీసుల్లో సాధించిన విజయాలనే, ఐసీసీ టైటిల్స్ గెలిచినట్టుగా ఆకాశానికి ఎత్తేస్తున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్...
అదీకాకుండా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో బ్యాటుతోనూ అద్భుతంగా రాణిస్తే, రోహిత్ శర్మ (ఒక్క న్యూజిలాండ్ సిరీస్‌తో మినహా) మాత్రం బ్యాటుతో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు.
సరైన ఫిట్‌నెస్ లేని రోహిత్ శర్మ, విదేశీ టూర్లకు ముందు గాయం పేరుతో కావాలని తప్పుకుంటాడని... అతన్ని G.O.A.T అని ఎలా అంటారంటూ ట్వీట్లు చేస్తున్నారు...
ట్విట్టర్‌లో #ViratKohli𓃵 హ్యాష్‌ట్యాగ్‌తో ఒక్క రోజులోనే లక్షల్లో ట్వీట్లు వస్తే, #RohitSharma𓃟 హ్యాష్ ట్యాగ్‌ను వాడుతూ పోస్టు చేసిన వారి సంఖ్య అంతకుమించి ఉండడం విశేషం..
కొందరు విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం రోహిత్ శర్మను ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని, టీమిండియాను లీడ్ చేసే వ్యక్తికి గౌరవం ఇవ్వాలంటూ కోరుతున్నారు...