- Home
- Sports
- Cricket
- నేను అందుకున్న గొప్ప గిఫ్ట్ విరాట్ కోహ్లీయే ఇచ్చాడు! ఆ క్షణం నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. - సచిన్ టెండూల్కర్
నేను అందుకున్న గొప్ప గిఫ్ట్ విరాట్ కోహ్లీయే ఇచ్చాడు! ఆ క్షణం నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. - సచిన్ టెండూల్కర్
మరో వందేళ్ల తర్వాత కూడా క్రికెట్ గురించి ప్రస్తావన వస్తే ముందు చెప్పుకోవాల్సిన పేరు సచిన్ టెండూల్కరే. క్రికెట్ ప్రపంచంలో అనితర సాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్, 24 ఏళ్ల సుదీర్ఘ కాలం క్రికెట్‌లో కొనసాగాడు..

200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన సచిన్ టెండూల్కర్, 34 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు, 100 సెంచరీలు, 160కి పైగా హాఫ్ సెంచరీలు సాధించాడు. సచిన్ టెండూల్కర్ 80+ నుంచి 99 మధ్య అవుటైన స్కోర్లన్నీ కలిపితే సచిన్ సెంచరీల సంఖ్య ఈజీగా 150 దాటేస్తుంది..
1989లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సచిన్ టెండూల్కర్, 1992, 1996, 1999, 2003, 2007, 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో పాల్గొన్నాడు. 2003 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ చేసిన 673 పరుగుల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు..
2013లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సచిన్ టెండూల్కర్, రిటైర్మెంట్ తర్వాత పదేళ్ల తర్వాత కూడా రోడ్ సేఫ్టీ వరల్డ్ టూర్ రూపంలో క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు..
తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు అందుకున్న సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇచ్చిన ఓ చిన్న తాడు... తన జీవితంలో అందుకున్న అత్యంత విలువైన గిఫ్ట్‌గా అభివర్ణించాడు...
‘2013లో నా ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో చాలా ఎమోషనల్ అయ్యాను. డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ మూలన ముఖం మీద టవల్ వేసుకుని పడుకున్నా.... కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటుంటే విరాట్ కోహ్లీ నా దగ్గరికి వచ్చాడు..
తన దగ్గరున్న ఓ ఎర్రదారాన్ని తీసి నాకు ఇచ్చాడు. అది ఖరీదైనదని కాదు, కానీ అది ఎందుకు ఇస్తున్నాడో విరాట్ కోహ్లీ చెప్పగానే నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను.
‘‘ఇది మా నాన్న నాకు ఇచ్చారు. ఆయన నాతో లేకున్నా, దీన్ని చూసినప్పుడల్లా ఆయన నాతో ఉన్నట్టు అనిపిస్తుంది.. నా వరకూ నా దగ్గరున్న అత్యంత విలువైన వస్తువు ఇదే. దీనికంటే గొప్పది నేను ఇవ్వలేను. ఇది మీకు ఇస్తున్నానంటే మీరు నాకు ఎంత విలువైనవాళ్లో, నా జీవితంలో ఎంతగా స్ఫూర్తినింపారో అర్థం చేసుకోండి.. ’’ అన్నాడు..
అతని కళ్లలో కూడా ఎమోషన్ చూశాను. అది తీసుకుని, కొద్దిసేపటికే అతనికి తిరిగి ఇచ్చేశాను. మీ నాన్న ఇచ్చినది, నీ దగ్గరే ఉండాలి. నీ ఆఖరి శ్వాస వరకూ దీన్ని ఎవ్వరికీ ఇవ్వకు అని చెప్పాను. ఆ క్షణం, ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి..’ అంటూ చెప్పుకొచ్చాడు సచిన్ టెండూల్కర్..